జాతీయ వార్తలు

రాజీవ్ కుమారుడిగా నేనేమీ చెప్పలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఇక్కడ స్పందించారు. ఏడుగురు హంతకులను విడుదల చేయాలన్న జయలలిత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ మాట్లాడుతూ ‘రాజీవ్ గాంధీ కుమారుడిగా ఈ విషయంపై నా అభిప్రాయం వెల్లడించలేను’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ రాజీవ్ హంతకుల విడుదలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘హంతకులను విడుదల చేయవద్దు’ అని ఆయన స్పష్టం చేశారు. తొలుత తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై పార్లమెంటులో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ‘ఈ అంశంపై సభలో చర్చకు వచ్చినప్పుడు పాల్గొంటాం’ అని ఖర్గే వెల్లడించారు. రాజీవ్‌గాంధీ హంతకులు ఇప్పటికే ఇరవై ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్నందున విడుదల చేయాలని నిర్ణయించినట్టు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జ్ఞానదేసికన్ కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షికి లేఖ రాశారు. వి శ్రీహరన్ అలియాస్ మురుగన్, టి సుతేంద్రరాజా అలియాస్ శంతన్, ఏజి పెరారివలన్ అలియాస్ అరివు, జయకుమార్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, నళినిలను విడుదల చేయాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయించి కేంద్రానికి లేఖ రాసింది.
10న హాజరుకండి
సల్మాన్‌కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ, మార్చి 3: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఈ నెల 10న కోర్టుకు హాజరుకావాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తాజాగా సమన్లు జారీచేసింది. 1998 అక్టోబర్ 15న కృష్ణజింకలను వేటాడిన నేరానికి సంబంధించి సల్మాన్‌ఖాన్‌పై ఆయుధ చట్టం కింద కేసు నమోదైన విషయం విదితమే. ఆయుధ లైసెన్స్ గడువు తీరిపోయినా ఆయుధాలను అక్రమంగా వినియోగించారని అటవీ శాఖ ఫిర్యాదు చేయడంతో లూని పోలీసులు సల్మాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీచేసింది.