జాతీయ వార్తలు

కన్హయ్యకు క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం జరిపించిన మెజిస్టీరియల్ విచారణలో జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు క్లీన్‌చిట్ లభించింది. ఫిబ్రవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో కన్హయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ విచారణలో తేలింది. ఈ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు అభియోగం మోపుతూ ఢిల్లీ పోలీసులు అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం న్యూఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 9న జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిలో కొంతమందిని జెఎన్‌యు పాలనా యంత్రాంగం ఇదివరకే గుర్తించింది. అయితే కన్హయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు సాక్ష్యం లేదని విచారణ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొమ్మిది వీడియోలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించగా, వాటిలో మూడు వీడియోలు నకిలీవని తేలిందని కమిటీ వివరించింది. వీటిలో ఒక న్యూస్ చానెల్ వీడియో ఉందని వెల్లడించింది. ఉమర్ ఖలీద్ ఎక్కువ వీడియోలలో కనిపించాడని, స్వతంత్ర కాశ్మీర్‌కు, అఫ్జల్ గురుకు అతని మద్దతు గురించి తెలిసిందేనని పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని అతనే నిర్వహించాడని, అతని పాత్ర గురించి మరింత విచారించాల్సిందేనని సూచించింది.

హైకోర్టు ఉత్తర్వు
మా వాదనకు రుజువు

కన్హయ్య కుమార్‌కు బెయిలుపై ఎబివిపి వాదన

న్యూఢిల్లీ, మార్చి 3: ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు షరతులతో బెయిలు మంజూరు చేయడం తమ వైఖరికి రుజువు అని, వర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థులు, అధ్యాయపకులు వేడుకలు జరుపుకొంటున్నట్లుగా ఆయనను నిర్దోషిగా విడుదల చేయడం ఎంతమాత్రం కాదని బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి గురువారం చెప్పుకొంది. అఫ్జల్ గురును ఉరి తీయడానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జెఎన్‌యు విద్యార్థుల మనస్సులోని దేశ వ్యతిరేక భావాలనే అంటురోగంతో బాధపడుతున్నారని, ఆపరేషన్ చేసయినా సరే దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని కన్హయ్య కుమార్‌కు బెయిలు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే కన్హయ్యకు బెయిలు ఇవ్వడాన్ని ఆయనను పూర్తి గౌరవంతో విడుదల చేయడంగా పేర్కొంటూ వేడుకలు జరుపుకోవడం ద్వారా జెఎన్‌యులోని ‘అఫ్జల్ గురు గ్యాంగ్’ ప్రజలను మోసం చేస్తోందని, నిజానికి కోర్టు ఉత్తర్వు మా వైఖరికి సమర్థన అని జెఎన్‌యు విద్యార్థి సంఘంలో ఏకైక ఎబివిపి సభ్యుడు, సంఘం సంయుక్త కార్యదర్శి సౌరభ్ కుమార్ శర్మ అన్నారు.
కన్హయ్య కుమార్‌కు హైకోర్టు బెయిలు మంజూరు చేసిన తర్వాత జెఎన్‌యు క్యాంపస్‌లో వేడుకలు జరుపుకోవడం పట్ల జెఎన్‌యు ఎబివిపి విభాగం నిరసన తెలియజేస్తూ, ఫిబ్రవరి 9న క్యాంపస్‌లో జరిగిన వివాదాస్పద కార్యక్రమంతో సంబంధం ఉన్న 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్‌కు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. కాగా, అంటువ్యాధిగా మారడానికి ముందే ఈ ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేయాలన్న బ్యానర్‌పై గురువారం వర్శిటీ పరిపాలనా భవనం వద్ద ఒక నిరసన ప్రదర్శన సైతం జరిగింది.

తీహార్ జైలునుంచి
కన్హయ్య విడుదల
న్యూఢిల్లీ, మార్చి 3: దేశద్రోహం ఆరోపణలపై మూడు వారాల క్రితం అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను గురువారం సాయంత్రం తీహార్ జైలునుంచి విడుదల చేశారు. దర్యాప్తుకు సహకరించాలని, అవసరమైనప్పుడు పోలీసుల ఎదుట హాజరు కావాలన్న షరతులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కన్హయ్యకు ఆరు నెలల తాత్కాలిక బెయిలును మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, కన్హయ్యకుమార్‌ను బెయిలుపై విడుదల చేసిన సందర్భంగా ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకొన్నారు. కన్హయ్య బెయిలు బాండ్‌ను, ఆయన విడుదల ఉత్తర్వులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆయనను జైలునుంచి విడుదల చేసినట్లు జైళ్ల శాఖ అదనపు ఐజి, తీహార్ జైలు ప్రతినిధి ముకేశ్ ప్రసాద్ చెప్పారు. కన్హయ్య కుమార్ జైలునుంచి బైటికి రాగానే జైలు వద్ద గుమికూడిన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ స్వాగతం పలికారు. జెఎన్‌యు క్యాంపస్‌లో సైతం పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి.