జాతీయ వార్తలు

మోదీ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉపదేశాలు వద్దు, మనసులోని మాట ప్రసంగం చేయవద్దంటూ ప్రతిపక్షం సభ్యులు రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. మోదీ గురువారం లోక్‌సభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినంత సేపూ ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ‘మీరు చెప్పేది ఒకటి చేసేది మరొకటి’ అంటూ ఒక సభ్యుడు వ్యాఖ్యానిస్తే మరో సభ్యుడు జోక్యం చేసుకుంటూ ‘ఉపదేశాలు ఇవ్వటం మానివేయాలి’ అంటూ సూచించారు. మనసులోని మాట ప్రసంగం వద్దని ఓ సభ్యుడు సూచిస్తే మరో సభ్యుడు అడ్డుపడుతూ కాంగ్రెస్ పథకాల పేరు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంటులో ఒకరోజు కేవలం మహిళా ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని మోదీ అన్నప్పుడు ఓ మహిళా ఎంపీ లేచి అభ్యంతరం తెలిపారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత మాన్ పలుమార్లు మోదీ ప్రసంగానికి అడ్డుపడటంతో ప్రతిపక్షానికి చెందిన మరో సభ్యుడు పప్పుయాదవ్ ఆయనపై విరుచుకుపడ్డారు. ‘మీరు మాటమాటకు లేచి గొడవ చేయడంతో ప్రధాని ప్రంసంగాన్ని వినలేకపోతున్నా’నంటూ యాదవ్ ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువురు సభ్యులు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. మోదీ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ వెళ్లిపోయేందుకు లేవగానే బిజెపి సభ్యులు విమర్శలు చేయడం మొదలెట్టారు. వెంటనే ప్రధాని జోక్యం చేసుకుని బిజెపి సభ్యులను వారించారు. ‘మీరిలా చేయటం మంచిది కాదు, వ్యంగ్య వ్యాఖ్యాలు చేయకూడదు’ అంటూ బిజెపి సభ్యులకు హితవుచెప్పారు. బిజెపి విమర్శించడం ప్రారంభించగానే బయటకు వెళ్లబోతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనకకు వచ్చి తన సీట్లో కూర్చుండిపోయారు.