జాతీయ వార్తలు

సుజనా ఇండస్ట్రీస్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు చెందిన హెస్టియా హోల్డింగ్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మారిషస్ బ్యాంకునుంచి సుజనా గ్రూప్ హామీదారుగా ఉన్న హెస్టియా సంస్థకు తీసుకున్న రూ.106 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని, లేదంటే ఆస్తులు జప్తు చేసుకునే అధికారం ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. 2012లో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హామీదారుగా ఉన్న హెస్టియా సంస్థ మారిషస్ బ్యాకు నుండి రూ.106 కోట్ల రుణాన్ని తీసుకుంది. రుణాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకు 2013లో హెస్టియా సంస్థకు నోటీసులిచ్చింది. ఈ రుణాన్ని చెల్లించకపోవడంతో మారిషస్ బ్యాంకు లండన్ కోర్టును ఆశ్రయించింది. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హెస్టియా సంస్థ నుండి సరైన సమాధానం రాకపోవడంతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ సివిల్ కోర్టులో మారిషస్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ కోర్టులో మారిషస్ బ్యాంకుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సుజనా ఇండస్ట్రీస్ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా మారిషస్ బ్యాంకుకు అనుకూలంగా తీర్పు రావడంతో సుజనా ఇండస్ట్రీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో శుక్రవారం ఈ కేసు విచారణ జరిగింది. హెస్టియా సంస్థ తరపున న్యాయవాదులు ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ బ్యాంకుకు, హెస్టియాకు మధ్య రుణ ఒప్పందంలో సవరణలు జరిగాయని, న్యాయపరమైన అంశాల కారణంగానే రుణం చెల్లింపులో ఆలస్యం జరిగిందని కోర్టుకు వివరించారు. సివిల్ కోర్టు, హైకోర్టు తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. గతంలో ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థిస్తూ సుజనా ఇండస్ట్రీస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.