అంతర్జాతీయం

అధ్యక్ష అభ్యర్థిత్వంపై చర్చలో యోగా అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో యోగా అంశం చోటు చేసుకుంది. అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతుండగా, క్రుజ్ దీర్ఘశ్వాస తీసుకోవాలని ట్రంప్‌కు సూచించారు. ‘శ్వాస తీసుకో, శ్వాస తీసుకో, శ్వాస తీసుకో’ అని క్రుజ్ ట్రంప్‌తో అన్నారు. ‘నీవు చేయగలవు. నీవు దీర్ఘశ్వాస తీసుకోగలవు. నాకు అది చాలా కష్టం’ అని క్రుజ్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మరో సెనేటర్ మారో రుబియో ఈ సంభాషణలో జోక్యం చేసుకొని ‘వారు యోగా చేస్తుంటే, నేను ప్రశ్నకు సమాధానం ఇవ్వాలా’ అని వ్యాఖ్యానించారు. ‘నీవు చేయలేవు. ఈ వేదికపై మేము యోగాను చూడలేమనే విశ్వాసం నాకు నిజంగా ఉంది’ అని క్రుజ్ అనడంతో ప్రేక్షకులు నవ్వుల్లో తేలిపోయారు. ‘మంచిది, అతను (ట్రంప్) బాగా వంగగలడు. నీవు ఎప్పటికీ నేర్చుకోలేవు’ అని రుబియో వ్యాఖ్యానించడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
అమెరికా ‘మత సంస్థకు’
భారత్ వీసా తిరస్కరణ
వాషింగ్టన్, మార్చి 4: భారత్‌లో మత పరమైన స్వేచ్ఛ తగ్గుతోందని వచ్చిన ఆరోపణలపై వివిధ వర్గాలతో చర్చించి, అంచనా వేయాలని భావించిన అమెరికాకు చెందిన కమిషన్ సభ్యులకు వీసా ఇవ్వడానికి భారత్ తిరస్కరించింది. ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్)’ చైర్మన్ రాబర్ట్ పి జార్జ్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ‘్భరత ప్రభుత్వం వీసాలు జారీ చేయడానికి తిరస్కరించడంతో మేము చాలా నిరాశకు లోనయ్యాం’ అని రాబర్ట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం శుక్రవారం నుంచి వారం రోజుల పాటు భారత్‌లో పర్యటించి, ప్రభుత్వ నేతలు, అధికారులు, మత నాయకులు, హక్కుల సంఘాల కార్యకర్తలతో చర్చలు జరపాలని భావించింది. ‘్భన్న సంస్కృతులు గల ప్రజాస్వామిక దేశమైన భారత్ అమెరికాకు సన్నిహిత భాగస్వామ్య దేశం కూడా అయినందున మా పర్యటనకు అనుమతిస్తుందనే విశ్వాసం ఉంది’ అని రాబర్ట్ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించడానికి యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.