జాతీయ వార్తలు

చిరునవ్వే చిరునామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ స్పీకర్, లోక్‌సభ సభ్యుడు పిఏ సంగ్మా(68) మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలూ శుక్రవారం వాయిదా పడ్డాయి. ఎలాం టి కార్యక్రమం చేపట్టకుండానే వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభ మాజీ స్పీకర్ సంగ్మా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందా రు. మేఘాలయలోని తుర లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్మా స్పీకర్ పదవి చేపట్టకముందు కేంద్ర ప్రభుత్వంలో సమాచారం, కార్మిక, వాణిజ్యం, బొగ్గు శాఖలు నిర్వహించారు. లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సంగ్మా మృతి చెందిన విషయం తెలిపారు. సుమిత్రా మహాజన్ ఆ తరువాత సంగ్మా మృతికి సభ తరపున, తన తరపున సంతాపం తెలిపారు. లోక్‌సభను చిరునవ్వుతో నిర్వహించటం తాను సంగ్మా నుంచి నేర్చుకున్నానని మహాజన్ గుర్తుచేసుకున్నారు. సభ్యుల ఆ తరువాత సం గ్మా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తమ సీట్లలో నిలబడి రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు.
కాగా సంగ్మా మృతికి సంతాపంగా రాజ్యసభ శుక్రవారం మధ్యా హ్నం నుంచి వాయిదా పడింది. సం గ్మా రాజ్యసభ సభ్యుడుగా పని చేయటం తెలిసిందే. సంగ్మా పార్థీవ దేహానికి పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించేందుకు చాలా మంది సభ్యులు ఆయన నివాసానికి వెళతారు కాబట్టి రాజ్యసభను కూడా మధ్యాహ్నం నుండి వాయిదా వేస్తే బాగుంటుందని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సభలో ప్రతిపాదించారు. జైట్లీ ప్రతిపాదనను ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ ఆజాద్, సిపిఎం పక్ష నేత సీతారామ్ ఏచూరి , ఇతర సీనియర్ నాయకులు సమర్థించారు. దీంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అందరి అభిప్రాయం మేరకు రాజ్యసభను మంగళవారానికి వరకు వాయిదా వేశారు.
chitram..
లోక్‌సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా
మృతదేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ