జాతీయ వార్తలు

మోదీవన్నీ శుష్కవాగ్దానాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటి: ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. లోక్‌సభలో గురువారం ప్రధాని చేసిన ప్రసంగం ఆయన హో దాను దిగజార్చేదిగా ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో దేశ ప్రజలకు మోదీ శుష్కవాగ్దానాలు చేశారని గువహటి సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విరుచుకుపడ్డారు. ఎన్ని కల్లో లబ్ధిపొందడానికి పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోనే అసోం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి స్థానిక పార్టీల మధ్య చిచ్చురేపి, హిందూ ఓట్లను కాజేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.‘లోక్‌సభలో గంట పదిహేను నిముషాలు ప్రసంగించిన ప్రధాని మోదీ నామీద వ్యక్తిగత విమర్శలకు దిగారు. నేను అడిగిన నాలుగు ప్రశ్నల్లో ఒక్కదానికి సమాధానం చెప్పే ధైర్యంలేక వ్యక్తిగత ఆరోపణలకు దిగారు’అని ఆయన అన్నారు.దేశ ప్రధానిగా మోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న రాహుల్ తాను అడిగిన ఒక్క ప్రశ్నకు వివరణ ఇవ్వలేకపోయారని విమర్శించారు.‘మేక్ ఇన్ ఇండియా పేరుతో ఉపాధి కల్పిస్తానన్నారు. జరగలేదు. విదేశాల్లో మూలుగుతన్న నల్లధనం వెనక్కి రప్పిస్తానన్నారు..చేయలేదు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధ్వజమెత్తారు. బుధవారం లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ వయసు పెరుతుంది గానీ.. కొందరు అవగాహన పెంచుకోరని రాహుల్‌పై పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం ఇక్కడో బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ బిజెపి ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్పించి వాటి అమలు చేసి న దాఖలాలు లేవని ఆరోపించారు. అసోం ప్రజలకు ఇస్తున్న హామీలకూ అదే గతి పడుతుందన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏ ప్రయోజనం జరిగిందని ప్రశ్నించారు. మొన్న బిహా ర్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఎన్‌డిఏకు అసోంలోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు.