జాతీయ వార్తలు

ఏపికి ప్రత్యేక హోదాపై తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జెడి శీలం ఆరో పించారు. శీలం శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి వాదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభు త్వం ఆదుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు. ‘ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని ఈ సభలో హామీ ఇచ్చారు. ఆ రోజు రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడేమో పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయంటూ సాకులు చెబుతున్నారు’అని ఆయన విరుచుకుపడ్డారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే ఎలా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా ఏపికి ప్రత్యేక హోదా దక్కకుండా చూసేందుకు కుట్ర జరుగుతోందని శీలం ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనటం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు టిడిపి సభ్యులు ఎందుకు పోరాటం చేయలేదు, సభలో ఉన్నప్పటికీ ఎందుకు వౌనం వహిస్తున్నారని శీలం, జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ‘సభలోనే ఉన్న టిడిపి సభ్యులు, కేంద్ర మంత్రి సజనా చౌదరి, సిఎం రమేష్‌లు ఏపికి ప్రత్యేక హోదా గురించి పల్లెత్తుమాట అనలేదు. మీరెందుకు నోరు విప్పటం లేదని’కాంగ్రెస్ సభ్యులు పదేపదే నిలదీసినా సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు నోరుమెదపకపోవడం గమనార్హం. ప్రతిపక్షానికి చెందిన కొందరు సభ్యులు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలన్న శీలం, జైరామ్ రమేష్ వాదనతో తాము ఏకీభవిస్తున్నామని స్పష్టం చేశారు.