జాతీయ వార్తలు

నేనేమీ మాట్లాడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యులో చోటుచేసుకున్న జాతివ్యతిరేక కార్యక్రమాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భావిస్తున్నారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్‌గురు సంస్మరణ సభ తరువాత జెఎన్‌యులో అనేక పరిణామాలు జరిగాయి. ‘జెఎన్‌యు వివాదంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆ అంశంపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు’అని అన్నారు. జెఎన్‌యు వివాదంపై శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు. వర్శిటీలో జాతివ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కన్హయ్యకుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టారు. కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు ఇంకా జుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
జెఎన్‌యు విద్యార్థుల
విజయోత్సవ సభ
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ బెయిల్‌పై విడుదలైన సందర్భంగా గురువారం రాత్రి క్యాంపస్‌లో విద్యార్థులు విజయోత్సవ సభ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పోస్టర్లు చేబూనిన విద్యార్థులు కన్హయ్యకు సంఘీభావంగా నినాదాలు చేశారు. తొలుత గంగాధాబా వద్దకు చేరుకున్న విద్యార్థులు ర్యాలీగా అడ్మిన్‌బ్లాక్ వద్దకు వెళ్లారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన కన్హయ్యకుమార్ తనకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుమార్ ప్రసంగిస్తున్నంత సేపూ విద్యార్థులు హర్షధాన్యాలు చేస్తునే ఉన్నారు.
రిజిస్ట్రార్‌ను తొలగించాలి
జెఎన్‌యు రిజిస్ట్రార్ భూపేందర్ జుట్షిని తప్పించి వర్శిటీ ప్రతిష్టను కాపాడాలని జెఎన్‌యు టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జెఎన్‌యు టీచర్స్ అసోసియేషన్ భూపేందర్ పదవీకాలం పొడిగించడం వర్శిటీ నియమ, నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. మానవ వనరుల మంత్రిత్వశాఖ కనుసన్ననలో రిజిస్ట్రార్ పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. జెఎన్‌యులో చోటుచేసుకున్న గొడవలకు రిజిస్ట్రారే కారణమని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కన్హయ్య ప్రచారం?
ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్షయ్యకుమార్ ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. లెఫ్ట్‌ఫ్రంట్ తరఫున ఆయన ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుమార్‌తో ప్రచారం చేయించి యువత ఓట్లు దక్కించుకోవాలని లెఫ్ట్‌ఫ్రంట్ భావిస్తోంది. బెయిల్‌పై వచ్చిన కన్హయ్య గురువారం రాత్రి జెఎన్‌యు క్యాంపస్‌లో చేసిన ఉపన్యాసం అందర్నీ ఆకట్టుకుంది.‘నేను ప్రధానితో విభేదిస్తాను. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనతో ఏకీభవిస్తాను. సత్యమేవ జయతే అంటూ మోదీ చేసిన ట్వీట్‌తో నేను ఏకీభిస్తాను. కారణమేమిటంటే సత్యమేవ జయతే అన్నది రాజ్యాగం మనకు ప్రసాదించింది’అని కుమార్ వ్యాఖ్యానించారు.