జాతీయ వార్తలు

ప్రాతినిధ్యం లేకుండా మహిళా సాధికారికతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగకుండా మహిళల సాధికారికత ఎలా సాధ్యమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రశ్నించారు. స్వాతంత్య్రం సాధించి ఇనే్నళ్లయినా పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించి లేదని, ఇది చాలా విచారకరమన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా వారి సాధికారికత ఎలా సాధ్యమన్నారు. ఈ వైఖరి మారాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో మొట్టమొదటిసారిగా శనివారం మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘చట్టసభల్లో మహిళా ప్రతినిధులు- నవోత్తేజ భారత నిర్మాణం’ పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును విజ్ఞాన్ భవన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ, బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ శిరిన్ శర్మిన్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశావ్యాప్తంగా దాదాపు 350 మంది మహిళా ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ, దేశంలో మహిళాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం బాధాకరమని , పౌరులందరికి సమానహక్కులని రాజ్యాంగంలో ఉన్నాయని, మహిళా ప్రాతినిధ్యం కూడా సమానంగానే ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి గత యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కృషిని ఆయన గుర్తు చేస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో ఒక సభ (లోక్‌సభ) ఈ బిల్లును మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించినప్పటికీ మరో సభ దాన్ని ఇప్పటికీ ఆమోదించలేదన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మాటల్లో కాకుండా చేతల్లో చిత్తశుద్ధిని కనబర్చాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్టప్రతి హమిద్ అన్సారీ మాటలు అక్షర సత్యమని ఆయన అన్నారు. రిజర్వేషన్లు లేకుండా అన్ని పార్టీలు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తాయన్న గ్యారంటీ లేదని, అలా ఆశించడం కూడా సరికాదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ‘బేటీ బచావో-బేటీ పఢావో’ పిలుపునిచ్చిన ప్రధాని మోడీకి రాష్టప్రతి ధన్యవాదాలు తెలిపారు.
కాగా స్వాతంత్య్ర ఉద్యమం నుండి కూడా మహిళాలు కీలకంగా వ్యవహరిస్తున్నారని ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ కొనియాడారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన దేశంలో మహిళలు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారని , రాజకియ పార్టీలే మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.
జాతీయ సదస్సు ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలు ప్రాధాన్యత పెరుగుతోందని ,రాష్టప్రతి, గవర్నర్ ,ముఖ్యమంత్రులుగా మహిళలు కీలక పదపులలో మంచి గుర్తింపు తీసుకొస్తున్నారని కొనియాడారు. మహిళా ప్రతినిధులు కేవలం మహిళలకు సంబంధించిన సమస్యల గురించే కాకుండా ఆర్థిక, దేశాభివృద్ధికి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించాలని సూచించారు. రక్షణ రంగంలో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలుగు రాష్ట్రాల నుండి మహిళ ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలనుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూన్న కె. కవిత ,కొత్తపల్లి గీత, బుట్టా రేణుక, తోట సీతారామ లక్ష్మిలు ఈ సదస్సుకు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సును ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ జాతీయ మహిళా సదస్సులో మహిళా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారని, అన్ని రంగాలలో మహిళల అభివృద్ధిపై చర్చ జరగడం శుభ పరిణామమని అన్నారు. పార్లమెంట్‌లో వివిధ కమిటీలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వాస్తవం అన్న ఆమె భవిష్యత్తులో కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రతినిధులు సదస్సులో మహిళ- స్వపరిపాలనపై రెండు రోజుల పాటు చర్చిస్తారని , రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, స్పీకర్ ప్రసంగాలు అందర్నీ ఆకట్టుకొన్నాయని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. కాగా మహిళలు ప్రతిరంగంలో రాణించాల్సిన అవసరం ఉందని, రాజకీయాలతో పాటుగా మిగిలిన రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని టిడిపి రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ మహిళా ప్రాధాన్యం ఉన్న ఇలాంటి సదస్సులు మరిన్ని జరగాలని, మహిళాబిల్లు చట్ట సభలలో ఆమోదం పొందాలని, అప్పుడే మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆమె చెప్పారు. రెండో రోజు ఆదివారం ఈ సదస్సు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనుంది. ఇదిలావుంటే, జాతీయ మహిళ ప్రతినిధుల సదస్సుకు హాజరై ప్రసంగించాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

చిత్రం... ఢిల్లీలో శనివారం ప్రారంభమైన రెండురోజుల మహిళా జాతీయ సదస్సు వేదికపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.