అంతర్జాతీయం

టిబెట్‌కు రెండో రైలుమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: టిబెట్‌ను దేశంలోని మిగతా భాగాలను అనుసంధానం చేస్తూ రెండో రైలు మార్గాన్ని చైనా నిర్మించనుంది. హిమాలయ ప్రాంతమైన టిబెట్‌కు మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగడంతో పాటుగా భారత్ సరిహద్దు ప్రాంతాలకు శరవేగంగా సైన్యాలను తరలించడానికి సైతం ఈ రైలుమార్గం ఉపయోగపడుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్ రాజధాని నగరమైన లాసా, సిచువాన్ రాష్ట్ర రాజధాని చెంగ్డు మధ్య ఈ కొత్త రైలుమార్గాన్ని నిర్మిస్తారని జాతీయ చట్టసభకు సమర్పించిన జాతీయ ఆర్థిక, సామాజికాభివృద్ధికి సంబంధించిన 13వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. అంతకుమించి వివరాలేమీ దానిలో లేవు. జాతీయ చట్టసభ ఆమోదించిన తర్వాత ఈ ప్రణాళికను ఈ ఏడాదే అమలు చేస్తారు. హిమాలయ పర్వత ప్రాంతల్లోని టిబెట్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ నిర్మించిన క్వింఘాయ్-టిబెట్ రైలుమార్గానికి ఈ కొత్త రైల్వే లైను అదనం. 2006 జూలైలో ప్రారంభమైన 1956 కిలోమీటర్ల పొడవైన ఆ రైలుమార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, పొడవైన పర్వత ప్రాంత రైలుమార్గం. రైలు మార్గాల విస్తరణకు తోడు చైనా టిబెట్ ప్రాంతంలో అయిదు విమానాశ్రయాలను కూడా నిర్మించింది. టిబెట్‌లో రైలు, రోడ్డు, విమాన సర్వీసులు శరవేగంగా విస్తరించడంతో సైన్యాలతోపాటుగా జనం ఈ ప్రాంతాలకు తరలిరావడానికి వీలుకలగడమే కాక మన దేశం కూడా సరిహద్దుల్లో ముఖ్యంగా చైనా తనదిగా చెప్పుకొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున వౌలిక సదుపాయాల విస్తరణను చేపట్టాల్సి వచ్చింది. కాగా, కొత్తగా నిర్మించబోయే రైలుమార్గం 1629 కిలోమీటర్లు ఉంటుందని, లాసానుంచి చెంగ్డు చేరుకోవడానికి కేవలం 15 గంటలు పడుతుందని ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా తెలియజేసింది. ఈ రైలుమార్గం వీలయినంత త్వరగా పూర్తవుతుందని తాము ఆశిస్తున్నామని, తమ అభివృద్ధికి, ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధికి ఇది కొత్త ఊపు నిస్తుందని టిబెట్‌లోని న్యింగ్‌చి నగర మేయర్ అయిన వాంగ్‌డుయి అన్నారు.