బిజినెస్

స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ జోష్ ( వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మదుపరుల కొనుగోళ్ల ఉత్సాహం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ లాభాలను అందుకున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత సూచీలు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌తో మదుపరులు పెట్టుబడులవైపు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్ రోజున పన్ను భయాల మధ్య నష్టాలకు లోనైనప్పటికీ.. ఆ తర్వాతి రోజు నుంచి మాత్రం బుల్ రంకెలు వేసింది. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 152.30 పాయింట్లు పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 42.70 పాయింట్లు కోల్పోయింది. అయితే మంగళవారం ఏకంగా ఏడేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో సెనె్సక్స్ లాభపడింది. ఈ ఒక్కరోజే 777.35 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ సైతం 235.25 పాయింట్లు ఎగబాకింది. బుధవారం కూడా ఈ జోరు కొనసాగగా, సెనె్సక్స్ 463.63 పాయింట్లు, నిఫ్టీ 146.55 పాయింట్లు ఎగిశాయి. గురువారం సైతం సెనె్సక్స్ 364.01 పాయింట్లు, నిఫ్టీ 106.75 పాయింట్లు పెరిగాయి. అయితే శుక్రవారం బుల్ జోరు తగ్గుముఖం పట్టగా, సెనె్సక్స్ 39.49 పాయింట్లు, నిఫ్టీ 9.75 పాయింట్లు లాభపడ్డాయి. మొత్తంగా గడచిన వారం సెనె్సక్స్ 1,492.18 పాయింట్లు లాభపడితే, నిఫ్టీ 455.60 పాయింట్లు అందిపుచ్చుకుంది. గత నాలుగేళ్లలో ఒక్క వారంలో ఇంతగా సూచీలు లాభాలను అందుకోవడం ఇదే తొలిసారి. ఇకపోతే ప్రస్తుతం సెనె్సక్స్ 24,646.48 వద్ద ముగియగా, నిఫ్టీ 7,485.35 వద్ద నిలిచింది. బడ్జెట్‌లో 2016-17 ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేస్తామని జైట్లీ చెప్పడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించనుందన్న అంచనాలు, వ్యవసాయ, వౌలిక రంగాలకు దాదాపు 36,000 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్‌లో కేటాయించడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు 25,000 కోట్ల రూపాయల మూలధన సాయాన్ని ఇస్తుండటం, మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి బాసెల్-3 నిబంధనల ప్రకారం సమీకరించే మూలధనం విషయంలో సడలింపులు వంటివి మదుపరులను గడచిన వారం పెట్టుబడులకు పెద్దపీట వేసేలా చేశాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 7.5 శాతంగా ఉండొచ్చంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) వేసిన అంచనా కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 4,800.16 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలోకి పట్టుకొచ్చారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలియజేసింది. ఇదిలావుంటే బిఎస్‌ఇ మిడ్- క్యాప్ సూచీ 652.16 పాయింట్లు పుంజుకుని 10,224.84 వద్ద ఉంది. స్మాల్-క్యాప్ సూచీ 730.52 పాయింట్లు ఎగిసి 10,285.75 వద్ద నిలిచింది. ఆయా రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్, రియల్టీ షేర్ల విలువ అత్యధికంగా 11.75 శాతం, 11.34 శాతం చొప్పున పెరిగాయి. ఆ తర్వాత మెటల్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆటో, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, టెక్నాలజీ, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్ల విలువ 10.22 శాతం నుంచి 3.63 శాతం మేర పెరిగాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 18,854.23 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 1,01,906.30 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 10,956.21 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 70,706.22 కోట్ల రూపాయలుగా ఉంది.

6 వేల గ్రామాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం

న్యూఢిల్లీ, మార్చి 5: దేశవ్యాప్తంగా చీకటిలో మగ్గుతున్న 18,500 గ్రామాల్లో 6 వేల గ్రామాలకు విద్యుత్ వెలుగులను అందించామని, 39.5 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని దరిచేర్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం తెలిపింది. శుక్రవారం రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కీలకమైన వౌలిక రంగాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ‘అందరికీ ఇండ్లు’ కార్యక్రమం తీరునూ పరిశీలించిన మోదీ.. దీని ప్రయోజనాలను ప్రజలకు వేగంగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.