జాతీయ వార్తలు

పునఃపంపిణీకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ మధ్య తలెత్తిన వివాదాన్ని మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 1001 టిఎంసిల నీటినే రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. తమకు లభించిన నీటిని రెండు రాష్ట్రాలు ఏ ప్రాతిపదికన పంచుకోవాలి? పంపిణీతో ముడిపడి ఉన్న ఇతర అంశాలపై గురువారం కేంద్రం ఒక అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు అందిస్తుంది. మంగళవారం జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ప్రపుల్ సి పంత్‌తో కూడిన బెంచి కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్టల్ర మధ్య జరుగుతున్న వివాదాన్ని విచారించింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపరిశీలించి తగిన న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ డిమాండ్ చేసింది. వీలైన పక్షంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా మహారాష్ట్ర, కర్నాటక తమకు లభించిన కేటాయింపులను అధికారపత్రంలో ప్రకటించి వాడుకునే వీలు కల్పించాలని కోరాయి. ఆంధ్ర కూడా కేటాయింపులను రాజపత్రంలో ప్రకటించరాదని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వివాదం ఆంధ్ర, తెలంగాణకే తప్పించి తమకెలాంటి సంబంధం లేదని కర్నాటక, మహారాష్ట్ర వాదిస్తున్నాయి. మంగళవారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచి పిటిషన్లను విచారణకు స్వీకరించింది. గతవారంలో జరిగిన వాదోపవాదాల్లో కేంద్రం ఒక ప్రణాళికను తయారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పదిహేను నిమిషాల్లో ప్రభుత్వం తన వివాదాన్ని న్యాయస్థానానికి తెలియ చేయాలని బెంచి ఆదేశించింది. ప్రభుత్వం పూర్తి వివరాలను మంగళవారానికల్లా అందిస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంగళవారం తొలుత బెంచి ఆ నివేదిక గురించే అడిగింది. ప్రభుత్వ న్యాయవాది క్షమాపణ కోరుతూ కొంత వ్యవధి ఇవ్వాలని కోరారు. రాత్రే నివేదిక పూరె్తైందని ఆయన చెప్పారు. నివేదిక పూరె్తైనందున వివరాలను తెలియ చేయాల్సిందిగా న్యాయమూర్తులు కోరారు. తమ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేయబోతోందని ఆయన చెప్పారు. ఇది తుది నిర్ణయమేనా? తిరిగి మారే అవకాశాలున్నాయా? అని బెంచి ప్రశ్నించగా, మార్పుండదని ప్రభుత్వ న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.