జాతీయ వార్తలు

జెఎన్‌యు ప్రతిష్ఠను కాపాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంపై దేశద్రోహ కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులతో ప్రస్తుతం ఆ యూనివర్శిటీ విద్యార్థి సంఘ (జెఎన్‌యుఎస్‌యు) పూర్వ అధ్యక్షులు కూడా గొంతు కలిపారు. జెఎన్‌యు ప్రతిష్టను నీరుగార్చి, ‘దేశ వ్యతిరేక’ యూనివర్శిటీగా చిత్రీకరించేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాలనైనా ప్రతిఘటించి తీరుతామని వారు స్పష్టం చేశారు. దేశద్రోహ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కంటే ముందు ఆ విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా వ్యవరించిన పలువురు విద్యావేత్తలు, విద్యార్థులు ప్రస్తుతం జెఎన్‌యులో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కన్హయ్య కుమార్, తాను వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారమే అయినప్పటికీ విద్యార్థులపైన, వారి భావ ప్రకటనా స్వేచ్ఛపైన జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని, జెఎన్‌యును ‘దేశ వ్యతిరేక’ వర్శిటీగా ముద్ర వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తాము ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, ఇది జెఎన్‌యు సంస్కృతిలోనే ఉందని 2012లో ఆ యూనివర్శిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా వ్యవహరించిన పిహెచ్‌డి స్కాలర్ సుచేతా డే తెలిపారు. అలాగే 2002-2004 మధ్యకాలంలో జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికై ప్రస్తుతం అదే యూనివర్శిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోహిత్‌తోపాటు మరికొంత మంది జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షులు మోహన్ దాస్ (2004), ధనుంజయ్ త్రిపాఠి (2006), సందీప్ సింగ్ (2007), అక్బర్ చౌదరి, వి.లెనిన్ కుమార్ (2013) తదితరులు కూడా విద్యార్థుల ఉద్యమానికి బాసటగా నిలిచారు.

చిత్రం... జెఎన్‌యు విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షులతో ప్రస్తుత అధ్యక్షుడు కన్హయ్య కుమార్