అంతర్జాతీయం

రసవత్తరంగా అమెరికా ఎన్నికల రేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాటన్ రోగ్: అమెరికా అధ్యక్ష పదవికోసం ప్రధాన పార్టీల్లో జరుగుతున్న పోటీ రానురాను రసవత్తరంగా మారుతోంది. ‘సూపర్ శనివారం’నాడు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ టెడ్ క్రుజ్, డెమోక్రాట్ బెర్నీ శాండర్స్‌లు కీలక విజయాలు సాధించడం ద్వారా తిరిగి పోటీలో నిలిచారు. అయితే ఇప్పటికే ఈ రెండు పార్టీల్లో ప్రత్యర్థులకన్నా ఎంతో ముందున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు ప్రతినిధులు అధిక సంఖ్యలో ఉండే లూసియానా రాష్ట్రంలో ఘన విజయాలు సాధించడం ద్వారా తమ ఆధిక్యతను చెక్కు చెదరకుండా నిలుపుకోగలిగారు.
డెమోక్రటిక్ పార్టీ శిబిరంలో హిల్లరీ క్లింటన్ ప్రధాన ప్రత్యర్థి అయిన వెర్మోంట్ సెనేటర్ శాండర్స్ కాన్సాస్, నెబ్రస్కా రాష్ట్రాల్లో ఘన విజయం సాధించారు. అయితే మాజీ విదేశాంగ మంత్రి అయిన హిల్లరీ క్లింటన్ అత్యంత కీలకమైన లూసియానాలో సునాయాస విజయం సాధించారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ శిబిరంలో టెక్సాస్ సెనేటర్ క్రుజ్ కాన్సాస్, మైనే రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించి ట్రంప్ ఆధిక్యతను తగ్గించగలిగారు. అయితే ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఉండే లూసియానా, కెంటకీ రాష్ట్రాల్లో విజయం సాధించడం ద్వారా ట్రంప్ క్రుజ్ పురోగతిని అడ్డుకోగలిగారు. అయితే రెండు రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించడం అధ్యక్ష పదవికి పార్టీ నామినేషన్‌ను సంపాదించే దిశగా ట్రంప్ పరుగును అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆయన వ్యతిరేక వర్గానికి నూతనోత్తేజాన్ని అందించినట్లయింది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించిన క్రుజ్ ఒక్కడే ట్రంప్‌ను అడ్డుకోగల సమర్థుడని వారు భావిస్తున్నారు. అయితే తమ ప్రత్యర్థులు గట్టిపోటీని ఇస్తున్నప్పటికీ ఈ రోజు ఫలితాలతో ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు వైట్‌హౌస్‌కోసం జరిగే పోటీలో తమ ఆధిక్యతను మరింత పటిష్ఠం చేసుకోగలిగారు. భారతీయ సంతతికి చెందిన బాబీ జిందాల్ సొంత రాష్టమ్రైన లూసియానాలో భారీ మెజారిటీతో విజయం సాధించిన ట్రంప్ కెంటకీ రాష్ట్రంలో స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. తనను గెలిపించిన లూసియానా, కెంటకీ రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు హిల్లరీ క్లింటన్ సైతం లూసియానా రాష్ట్రంలో ఘన విజయం సాధించారు. అయితే కాన్సాస్, నెబ్రస్కా రాష్ట్రాల్లో ఆమె శాండర్స్ చేతిలో ఓడిపోయారు.
ఇదిలా ఉండగా శనివారం ఎన్నికలు జరిగిన నాలుగు రిపబ్లికన్ ప్రైమరీ రాష్ట్రాల్లోను పార్టీ అభ్యర్థిత్వంకోసం పోటీ పడుతున్న సెనేటర్ మార్కో రుబియో దారుణంగా పరాజయం పాలయ్యారు. దీంతో ట్రంప్ ఆయనను పోటీనుంచి తప్పుకొమ్మని కోరారు. అయితే తాను పోటీనుంచి తప్పుకోబోనని రుబియో ప్రకటించారు.

ఐసిస్‌పై యుద్ధాన్ని తీవ్రం చేయనున్న అమెరికా

బి-52 యుద్ధవిమానాలతో దాడులకు రంగం సిద్ధం

వాషింగ్టన్, మార్చి 6: ఐసిస్‌పై యుద్ధాన్ని తీవ్రంచేసే చర్యల్లో భాగంగా ఏప్రిల్‌లో సిరియా, ఇరాక్‌లకు బి-52 యుద్ధవిమానాలను పంపించనున్నట్లు అమెరికా మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న బి-1 లాన్సర్ల స్థానంలో న్యూక్లియర్ బాంబులను ఉపయోగించే సామర్థ్యం కలిగిన బి-52 యుద్ధ విమానాలను వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో అఫ్గాన్‌తోపాటు ఇతర దేశాల్లో జరిపిన దాడుల్లో వీటిని వినియోగించారు. ముద్దుగా ‘బఫ్’ (బిగ్ అగ్లీ ఫాట్ ఫెల్లా) అని పిలిచే ఈ విమానాలు 70వేల పౌండ్ల పేలుడు సామగ్రిని మోసుకెళ్లే సామర్థ్యం కలిగివుంటాయి. వీటిలో గ్రావిటీ బాంబులు, క్లస్టర్ బాంబులతోపాటు మిసైళ్లు కూడా ఉంటాయి.