జాతీయ వార్తలు

అఫ్జల్ ఉరి అమలు జరిగిన తీరు తప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడిన అఫ్జల్ గురును 2013లో ఉరితీసిన తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీ ఆదివారం అనుమానాలు వ్యక్తం చేస్తూ, మెడకు ఉరితాడు బిగుసుకునే చివరిక్షణం వరకు కూడా మానవ హక్కులదే పైచేయి కావాలన్నారు. ‘ఉరి అమలు తీరు తప్పని ఒక మాజీ న్యాయమూర్తిగా నేను చెప్పగలను. అతని క్షమాభిక్ష పిటిషన్‌ను ఫిబ్రవరి 3న తిరస్కరించారు. ఫిబ్రవరి 9న ఉరిని అమలు చేశారు. ఇది తప్పు, దాన్ని సవాలు చేసే హక్కు ఆయనకు ఉంది. ఉరి గురించి సమాచారం ఇవ్వాల్సిన హక్కు అతని కుటుంబ సభ్యులకు ఉంది. మెడకు ఉరి బిగుసుకునే చివరి క్షణం వరకు మానవ హక్కులు ఉంటాయి’ అని గంగూలీ అన్నారు. టెలిగ్రాఫ్ పత్రిక ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ చర్చా గోష్ఠిలో గంగూలీ మాట్లాడారు.
ట్రక్కు బాంబు పేలి
47 మంది మృతి
హిల్లా (ఇరాక్), మార్చి 6: ఇరాక్‌లోని హిల్లా నగర శివార్లలో ఆదివారం ఒక ట్రక్కు బాంబు పేలి 47 మంది మృతి చెందారు. ఇందులో 20 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని, వీరితో పాటు 72 మంది గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. హిల్లా నగరానికి ఉత్తరాన గల చెక్‌పాయింట్ వద్ద ఈ దాడి జరిగిందని బాబిల్ ప్రావిన్సియల్ కౌన్సిల్ భద్రతా కమిటీ అధినేత ఫలే అల్ రదీ చెప్పారు. ఈ సంవత్సరం ఇరాక్‌లో జరిగిన కారుబాంబు పేలుళ్లలో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే మొదటిసారి. పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కు హిల్లా నగరంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా, చెక్‌పాయింట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆపివేశారు. దీంతో ఆత్మాహుతి దళ సభ్యుడు ట్రక్కులోని పేలుడు పదార్థాలను పేల్చివేయడంతో అక్కడ బీభత్సకరమైన పరిస్థితి నెలకొంది.

సాక్షులందరినీ మా దేశానికి పంపాలి

ముంబయి దాడుల కేసులో భారత్‌కు పాకిస్తాన్ విజ్ఞప్తి

లాహోర్, మార్చి 6: ముంబయి దాడుల కేసుపై విచారణ జరుపుతున్న తీవ్రవాద వ్యతిరేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు భారత్‌కు చెందిన 24 మంది సాక్షులను తమ దేశానికి పంపాల్సిందిగా పాకిస్తాన్ కోరిందని చీఫ్ ప్రాసిక్యూటర్ చౌదరి అజార్ ఆదివారం వెల్లడించారు. 26/11 (ముంబయి దాడుల) కేసుకు సంబంధించి దిగువ కోర్టులో వాంగ్మూలాలను ఇచ్చేందుకు 24 మంది భారత సాక్షులను పాకిస్తాన్‌కు పంపాల్సిందిగా భారత ప్రభుత్వానికి విదేశాంగ శాఖ లేఖ రాసిందని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. ముంబయి దాడుల కేసుపై పాక్‌లో ఆరేళ్ల నుంచీ విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇస్లామాబాద్‌లోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఇప్పటికే పాకిస్తాన్‌కు చెందిన సాక్షులందరి నుంచి వాంగ్మూలాలను స్వీకరించిందని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ వ్యవహారంలో బంతి భారత్ కోర్టులోనే ఉందని, ఈ కేసులో వాంగ్మూలాలను ఇచ్చేందుకు భారత్‌లోని సాక్షులందరినీ పాకిస్తాన్‌కు పంపితే దిగువ కోర్టులో ఈ కేసు విచారణ మరింత ముందుకు సాగుతుందని చౌదరి అజార్ చెప్పారు. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ కమాండర్ జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ సహా ఏడుగురు నిందితులపై విచారణ జరుపుతున్న దిగువ కోర్టు ఈ కేసులో వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు వీలుగా భారత్‌కు చెందిన మొత్తం 24 మంది సాక్షులను తమ ఎదుట హాజరుపర్చాలని గత వారం పాక్ జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించింది.

కన్హయ్య హీరో కాదు..
దారి తప్పినవాడు!

వామపక్షాలకు రాజకీయాల్లో చోటులేదు
కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఉద్ఘాటన

కోల్‌కతా, మార్చి 6: వామపక్షాలకు రాజకీయాల్లో చోటు లేకపోవడంతో విశ్వవిద్యాలయాలు, ప్రచార మాధ్యమాలు, ఎన్‌జిఓల్లో ఆశ్రయం పొందుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ విమర్శించారు. దేశద్రోహ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్య కుమార్ నాయకుడు (హీరో) కాదని, అతను ‘దారి తప్పినవాడని’ ఆయన అన్నారు. ‘ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో చెల్లాచెదురైన వామపక్షాలకు రాజకీయాల్లో చోటులేకపోవడంతో అవి విశ్వవిద్యాలయాలు, ప్రచార మాధ్యమాలు, ఎన్‌జిఓల్లో తలదాచుకుంటున్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని రాజీవ్ ప్రతాప్ రూడీ ఆదివారం కోల్‌కతాలో విలేఖర్లతో అన్నారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు తమ అభ్యర్థులకు మద్దతుగా కన్హయ్య కుమార్‌తో ప్రచారం నిర్వహించాలని భావిస్తుండటంతో అతను హీరోగా అవతరించాడా? అని విలేఖర్లు ప్రశ్నించగా, కన్హయ్య హీరో కాదని, దారి తప్పినవాడని రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. జాతీయవాదాన్ని విశ్వసిస్తూ సరైన ఆలోచనలతో ముందుకు సాగేవారెవరూ కన్హయ్య కుమార్ చర్యలను, అతని ప్రసంగాలను సహించలేరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.