జాతీయ వార్తలు

రాజ్యసభలో తగ్గనున్న కాంగ్రెస్ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, ఇంధన మంత్రి పియూష్ గోయల్, కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి, కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, జెడి (యు) అధినాయకుడు శరద్ యాదవ్, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకె అంటోని, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సహా మొత్తం 69మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనుంది. వచ్చే నెల అంటే ఏప్రిల్‌లో 12మంది సభ్యులు రిటైరవుతుంటే, జూన్‌లో ఉమ్మడి ఆంధ్రకు చెందిన ఆరుగురు సభ్యులు సహా మొత్తం 21మంది సభ్యులు రిటైరవుతారు. జూలైలో అత్యధికంగా 34మంది సభ్యత్వకాలం ముగుస్తోంది. ఆగస్టులో రైల్వే మంత్రి సురేష్ ప్రభు, గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేంద్ర సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. ఏప్రిల్‌లో రిటైరవుతున్న 12మందిలో ఆంటోని, ఎంఎస్ గిల్, నరేష్ గుజ్రాల్, అశ్వినీ కుమార్ తదితరులున్నారు. ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేసింది. ఆంధ్రకు చెందిన వైఎస్ చౌదరి, నిర్మలా సీతారామన్, జయరాం రమేష్, జెడి శీలం, తెలంగాణకు చెందిన వి హనుమంతరావు, గుండు సుధారాణితో పాటు మొహిసీనా కిద్వాయి, చందన్ మిత్రా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండేజ్‌తోపాటు 21మంది జూన్‌లోరిటైరవుతారు. జూలైలో శరద్ యాదవ్, కెసి త్యాగి, అంబికా సోని, సతీష్ శర్మ, సతీష్ మిశ్రా, ముక్తార్ అబ్బాస్ నఖ్వి, రాంజెత్మలానీ, పియూష్ గోయల్, ఆనంద్ శర్మతోపాటు మొత్తం 34మంది సభ్యులు రిటైరవుతారు. రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆంధ్ర నుంచి రిటైరవుతున్నా, కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. రిటైరవుతున్న 69మందిలో పలువురు ప్రముఖులు మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఇంతకాలం కర్నాటకకు ప్రాతినిధ్యం వహించిన ఎం వెంకయ్యనాయుడు ఈసారి మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కర్నాటక నుంచి రాజ్యసభకు వచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరంతోపాటు జయరాం రమేష్, మరో సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆస్కార్ ఫెర్నాండేజ్‌కు పార్టీ టికెట్ లభించటం దాదాపుగా ఖాయమని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. సిఎం సిద్ధరామయ్య తన వర్గానికి చెందిన ఒకరికి రాజ్యసభ టికెట్ ఇప్పించుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రకు సంబంధించినంత వరకు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ రాజ్యసభకు మరోసారి ఎన్నికవుతారని అంటున్నారు. రాష్ట్రంలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతుంటే, ఇందులో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి లభిస్తే, ఒక స్థానం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపాకు దక్కాల్సి ఉంది. సిఎం చంద్రబాబు ఒక మహిళను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి లభించే ఒక సీటుకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేయాలని మొదటి నుంచీ ఆలోచించటం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాపు వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ లేదా ముద్రగడ పద్మనాభానికి రాజ్యసభ సీటు కేటాయించినా ఆశ్చర్యపోకూడదనదే మాట వినిపిస్తోంది. ఆంధ్రలో వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెదేపాలోకి జంప్ చేసినందున పార్టీల బలాబలాల్లో మార్పులుంటాయి. తెలంగాణలో హనుమంతరావు, సుధారాణి సీట్లు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్, తెదేపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరినా వారి మొత్తం సీట్ల సంఖ్య ఎనభై దాటటం లేదు. తెరాస అధినాయకుడు, సిఎం కె చంద్రశేఖర్ రావు ఎవరిని రంగంలోకి దించుతారనేది చర్చనీయాంశంగా మారింది. తెరాస మద్దతతో నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు హనుమంతరావు తెరవెనక ప్రయత్నం జరిపినట్టు తెలిసింది. గతంలో తెరాస సీనియర్ నాయకుడు కె కేశవరావు రాజ్యసభకు ఎంపికయ్యేందుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినందున, ప్రతిగా ఈసారి తెరాస తన అభ్యర్థిత్వాన్ని సమర్థించాలని హనుమంతరావు వాదించినట్టు తెలిసింది. అయితే చంద్రశేఖరరావు మాత్రం కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు నిరాకరించటంతో హనుమంతరావు తన ప్రయత్నాలను మానుకున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం. ఇదిలావుంటే ఆనంద్ శర్మ మరోసారి హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నిక కావటం ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 21మంది సభ్యత్వం ముగుస్తుండగా, కేవలం 17మంది మాత్రమే తిరిగి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య కొంత తగ్గుతుంది. ఆంధ్ర, తెలంగాణ నుంచి హనుమంతరావు, శీలం, జయరాం రమేష్ రిటైరవుతున్నా, కాంగ్రెస్ ఈసారి ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు.