బిజినెస్

మాల్యాపై మనీ లాండరింగ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్‌కు బ్యాడ్‌టైమ్స్ మొదలయ్యాయి. విజయ్ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. దీంతో ఈ లిక్కర్ వ్యాపారికి కొత్త చిక్కులు వచ్చిపడగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ నుంచి 900 కోట్ల రూపాయలకుపైగా తీసుకున్న రుణం ఎగవేతకు సంబంధించి మాల్యాతోపాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు నమోదు చేసింది. ఐడిబిఐ రుణాల ఎగవేత కేసులో గత ఏడాది కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈమధ్యే కేసు నమోదు చేశామని సంబంధిత అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇక్కడి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జోనల్ కార్యాలయంలో కేసు నమోదైందని, అధికారులు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక వ్యవహారాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘనపైనా ప్రత్యేకంగా దర్యాప్తు మొదలైందన్నాయి. త్వరలోనే మాల్యాతోపాటు ఈ కేసులో ఉన్నవారిని ప్రశ్నిస్తామన్న సదరు వర్గాలు.. కొన్ని డ్యాక్యుమెంట్లనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు 7,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడ్డ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. 2012 అక్టోబర్ నుంచి విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. ఈ రుణాల్లో ఐడిబిఐ బ్యాంక్ రుణం కూడా ఉంది. మాల్యాను ఇప్పటికే ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించగా, యునైటెడ్ బ్యాంక్ సైతం ఆలోచిస్తోంది.
మాల్యాకు డిఆర్‌టి షాక్
బెంగళూరు: విజయ్ మాల్యాకు సోమవారం మరో దెబ్బ తగిలింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకునే క్రమంలో డియాజియోతో కుదిరిన 515 కోట్ల రూపాయల (75 మిలియన్ డాలర్ల) ఒప్పందంలో ఆ సొమ్మును తీసుకోరాదని మాల్యాను డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) ఆదేశించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల వ్యవహారంలో తమ రుణాన్ని మాల్యా ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నారని, కాబట్టి రుణాల వసూళ్లలో భాగంగా ఈ ఒప్పందంలోని 515 కోట్ల రూపాయలపై తమకే తొలి హక్కు ఉంటుందని, దాన్ని మాల్యా తీసుకోరాదంటూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ వేసిన పిటిషన్‌పై డిఆర్‌టి పైవిధంగా స్పందించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసు పూర్తయ్యేవరకు ఖాతాలోనే 515 కోట్ల రూపాయలు ఉంచాలని ఆదేశించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు 17 ప్రభుత్వరంగ బ్యాంకులు 7,800 కోట్ల రూపాయల రుణాలివ్వగా, ఇందులో ఎస్‌బిఐ ఇచ్చింది 1,600 కోట్ల రూపాయలు. మరోవైపు ఎస్‌బిఐ పిటిషన్‌తో కర్నాటక హైకోర్టు కూడా మాల్యాపై నోటీసుల జారీకి ఆదేశించినది తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ గొడవల మధ్య బ్రిటన్‌కు మకాం మార్చాలని మాల్యా చూస్తున్న క్రమంలో ఆయనను అరెస్టు చేయాలని, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఎస్‌బిఐ కోరుతోంది. మరోవైపు మాల్యా దేశ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని కింగ్ ఫిషర్ ఎయర్‌లైన్స్ ఉద్యోగులు ఏకంగా ఓ బహిరంగ లేఖనే ఆదివారం విడుదల చేశారు.