జాతీయ వార్తలు

నకిలీ వీడియోలు ప్రసారం చేసిన చానళ్లపై క్రిమినల్ కేసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజకీయాలలో పెద్ద చర్చను లేవనెత్తిన జెఎన్‌యుకు సంబంధించిన నకిలీ వీడియోలను ప్రసారం చేసిన చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కోర్టును ఆశ్రయించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కోర్టులో క్రిమినల్ కేసులు వేయాలని ప్రభుత్వ న్యాయవాదిని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 9, 11 తేదీలలో జెఎన్‌యులో జరిగిన వివిధ కార్యక్రమాలలో జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ అసలు ఈ ఘటనలో ఎటువంటి జాతి వ్యతిరేక నినాదాలు చేయలేదని, ఆ వీడియోలో ఆ నినాదాలను తర్వాత మార్ఫింగ్ చేశారని మేజిస్ట్రేట్ తేల్చారు. ఈ ఘటనలకు సంబంధించిన తొమ్మిది వీడియోలు బయటకు వస్తే అందులో రెండు వీడియోలను మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం కలిశారు. అనంతరం ఏచూరి విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు.
భూముల గోల్‌మాల్‌పై
అసెంబ్లీ చర్చించాలి
సిపిఎం నేత బివి రాఘవులు డిమాండ్
ఆంధ్రభూమిప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి,7: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల గోల్‌మమాల్‌పై అసెంబ్లీలో చర్చ జరగాలని, రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత వ్యవహారంలా జరుగుతోందని సీపీఎం పొలిట్‌బ్యురో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడిన ఆయన అధికార, విపక్షాలు పరస్పరం నిందించకోవడం వల్ల అధికార పక్షానికే లాభం జరుగుతుందని,సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష వైకాపా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని,ఏపీకి మరింత ఎక్కువగా నష్టం జరిగిందని తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఏంత వరకూ అమలు చేసిందో శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు శే్వతపత్రం విడుదల చేయలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.
ఏపిలో అయితే కుక్కపై కేసు పెట్టేవారు
రావెల సుశీల్ వ్యవహారంపై రోజా విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 7: మహిళలను వేధించేవారికి అండగా ఉంటున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తెలంగాణలో జరిగింది కాబట్టి కేసు నమోదైందని, ఆంధ్రలో జరిగి ఉంటే కుక్క పిల్లపై కేసు నమోదు చేసే వారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలంటే చులకన భావం ఉందని ఆమె సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని లోగడ చంద్రబాబు ఢిల్లీలో అన్నారని ఆమె గుర్తు చేశారు. దీనిని బట్టి ఆడపిల్లలంటే బాబుకు ఎంత చులకన భావం ఉందో స్పష్టమైందని అన్నారు. ఎన్నికలకు ముందు బాబు మాటలు నమ్మిన మహిళలు భద్రత ఉంటుందనుకుని ఓట్లు వేశారని ఆమె తెలిపారు. కానీ రాష్ట్రంలో కీచక పాలన జరుగుతున్నదని ఆమె విమర్శించారు.

దేవాదులకు రూ.112 కోట్ల నిధుల విడుదల

న్యూఢిల్లీ, మార్చి 7: కేంద్ర జల వనరుల శాఖ తెలంగాణలోని దేవాదుల ఎత్తిపోతల పథకానికి తొలివిడతగా ఏఐబిపి పథకం కింద 112 కోట్ల యాభై లక్షల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గత వారం టాస్క్ ఫోర్సు సమావేశానికి వచ్చినప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు ఏఐబిపి కింద విడుదల చేయవలసిన 112 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరటం తెలిసిందే. హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు దేవాదుల బకాయిలను వీలున్నంత త్వరగా విడుదల చేస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దేవాదుల ప్రాజెక్టుకు 112 కోట్ల యాభై లక్షల రూపాయలను విడుదల చేస్తూ మార్చ్ 3 తేదీనాడే ఉమాభారతి ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం పనులను చేపడుతున్న తీరునుబట్టి నిధుల విడుదల జరుగుతుందని కేంద్ర జలవననరుల శాఖ తమ ఆదేశంలో స్పష్టం చేసింది.