జాతీయ వార్తలు

నలుగుర్ని పెళ్లాడే హక్కు మగవాళ్లకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్: ముస్లిములలో మగవారు నలుగురు స్ర్తిలను వివాహం చేసుకునే వీలు ఉన్నప్పుడు ముస్లిం స్ర్తిలకు మాత్రం ఆ హక్కు ఎందుకుండకూడదని కేరళ హైకోర్టు న్యాయమూర్తి బి. కేమల్ పాషా ప్రశ్నించారు. ముస్లిం మహిళా ఫోరం ఆదివారం ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ సక్రమమైన జీవితం గడపాలంటే మగవాడయినా, స్ర్తి అయినా ఒకే భాగస్వామిని కలిగి ఉండాలన్నారు. ముస్లిం వివాహ చట్టం వరకట్నం, విడాకులు, వారసత్వం లాంటి విషయాలలో మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని, ఈ అంశాల విషయంలో ఖురాన్‌లో చెప్పిన దానికి ఈ చట్టం పూర్తి భిన్నంగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇది వివక్షేనని, ఇలాంటి పరిస్థితిని సృష్టించిన మత పెద్దలు ఈ వివక్షను సరిచేయడానికి సిగ్గుపడకూడదని అన్నారు. తాము తీర్పులు ఇవ్వడానికి అర్హులమా కాదా అనే విషయంపై కూడా వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని, తీర్పులు అందుకునే వారు సైతం ఈ విషయం గురించి ఆలోచించాలని హితవు చెప్పారు. నిస, పునర్జని చారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. వాస్తవానికి ఖురాన్ మహిళలకు ‘్ఫసక్’ రూపంలో కోర్టులకు వెలుపల విడాకులు ఇచ్చే హక్కు కల్పించగా, ముస్లిం వివాహ చట్టం మహిళలకు ఆ హక్కును కల్పించలేదని, పైగా మగవాళ్లకు మాత్రం ‘తలాక్’ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే హక్కును కల్పించిందని న్యాయమూర్తి పాషా అన్నారు. రాజ్యాంగం మగవారికి, స్ర్తిలకు సమాన హక్కులు కల్పించిందని, దేశంలోని అన్ని చట్టాలు కూడా రాజ్యాంగంలోని 14వ అధికరణం, 21వ అధికరణం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ముస్లిం వివాహ చట్టాన్ని సరిగా క్రోడీకరించకపోవడమే దానిలో లోపాలకు మూలకారణమన్నారు. వారసత్వ హక్కుకు సంబంధించిన ‘హనాఫీ’ విషయంలోనూ ముస్లిం వివాహ చట్టంలో లోపాలున్నాయని, ఆ చట్టం ప్రకారం అందరూ కుమార్తెలున్న తండ్రి ఆస్తి అతని కుమార్తెలు, భార్యకు మాత్రమే వారసత్వంగా సంక్రమించే వీలు లేదని, అతని అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు కూడా ఆ ఆస్తిపై హక్కు ఉంటుందని కూడా పాషా చెప్పారు.