జాతీయ వార్తలు

నిందకందని కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మరణం మాదిరిగా కాంగ్రెస్ ఎప్పుడూ నిందకు దొరకదు. మరణానికి దారితీసే పరిస్థితులను తప్ప, మరణాన్ని నిందించలేం, కాంగ్రెస్ మాదిరిగానే.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ కాంగ్రెస్‌ను మరణంతో పోల్చారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మైక్రోస్కోప్‌లో చూస్తున్న కాంగ్రెస్, తమ ప్రభుత్వాన్ని బైనాక్యులర్‌తో కూడా చూడలేదని ఎద్దేవా చేశారు. దేశాభివృద్ధికి అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ ప్రకటించారు. మరణం దీవెన లాంటిది, దాన్ని ఎవ్వరూ విమర్శించరు. ఎవరైనా మరణిస్తే ఫలానా కారణంగా మరణించాడని అంటారు తప్ప, మరణాన్ని దూషించారని, ఇదేవిధంగా కాంగ్రెస్‌నూ ఎవ్వరు విమర్శించరు, దూషించరని మోదీ వ్యగ్యంగా అన్నారు. కాంగ్రెస్ విమర్శలకు అతీతమంటారని విమర్శించారు. తానెప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించినా ప్రతిపక్షం దాడికి గురవుతోందనే మీడియా విమర్శలు గుప్పిస్తోందని అంటూ, ఈ సందర్భంగా మరణాన్ని ప్రస్తావించారు. జెడి (యు), బిఎస్పీని ప్రభుత్వం విమర్శించినప్పుడు మాత్రం ప్రభుత్వం జెడి(యు)పై దాడి చేస్తోంది, బిఎస్పీపై దాడి చేస్తోందని అంటారు తప్ప ప్రతిపక్షంపై దాడి చేస్తోందనే మాట వాడరని అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించేందుకు మోదీ మరోసారి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును ఉటంకించారు. మనం రెండు రకాల మనుషుల్ని చూస్తాం. ఒకరేమో పని చేసే వారు, మరొకరేమో ఎవరో చేసిన పనిమూలంగా ప్రయోజనం పొందేవారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను విమర్శించారు.
రాజ్యసభ సభ్యులకు విజ్ఞప్తి
లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు ఆమోదం తెలపటం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని మోదీ రాజ్యసభ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఆమోదించిన బిల్లులను వీలైనంత త్వరగా ఆమోదించటం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభిస్తే దేశాభివృద్ధి ఊపందుకుంటుందన్నారు. బిల్లుల ఆమోదానికి దేశం ఎదురు చూస్తోందన్నారు. రాజ్యసభ ఆలోచనలతో కూడిన సభ. దేశానికి మార్గదర్శనం చేయాలని మోదీ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధి కొద్దికొద్దిగా కాకుండా పెద్దఎత్తున జరగాల్సి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా జరగాలన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సలహాను సభ్యులు పాటించటంపట్ల నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. విద్యారంగంలో ఆశించిన మేర సౌకర్యాలు లేకపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యావకాశాలు పెంచేందుకు గట్టి కృషి జరగాల్సి ఉందన్నారు. బాలికల విద్య, అక్షరాస్యతకు తాను గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు అవలంబించిన విధానాలను సభ్యులకు వివరించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో 30శాతం సీట్లను నిరక్షరాస్యులకు కేటాయించాలని రాజకీయ పక్షాలకు సూచించారు. స్వచ్ఛ్భారత్ నినాదం ఉద్యమరూపం ధరిస్తోందని అంటూ, పరిశుభ్రత పెరిగితే అనారోగ్య సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వం ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని, అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2022నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముద్రా బ్యాంకుమూలంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు అత్యధిక ప్రయోజనం కలిగిందని అంటూ, పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తికీ అందేలా చూస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.