జాతీయ వార్తలు

పగలే చీకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సంపూర్ణ సూర్యగ్రహణం బుధవారం ఉదయం ఇండోనేసియా, పసిఫిక్ ప్రాంతంలోని కోట్లాదిమందికి కనువిందు చేసింది. చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్యగా వచ్చిన కారణంగా ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం ఉదయం 6 గంటల 19 నిమిషాలకు (్భరత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.49కి) ప్రారంభమైంది. అయితే భారత్‌లో మాత్రం గ్రహణం పాక్షికంగానే కనిపించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం 9 గంటల 8 నిమిషాల వరకు కొనసాగింది. ఇండోనేసియా, సెంట్రల్ పసిఫిక్ ప్రాంతంలో గ్రహణం పూర్తిగా కనిపించగా ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఆసియా ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే కనిపించింది.
చిత్రం....
విశాఖ తీరంలో కనిపించిన సూర్యగ్రహణం సుందర దృశ్యం