జాతీయ వార్తలు

సాంస్కృతిక సమ్మేళనానికి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వివాదాల సుడిగుండంలో తిరుగుతున్న అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవానికి ఎట్టకేలకు బుధవారం పొద్దుపోయిన తర్వాత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఈ మూడు రోజులు ఉత్సవ నిర్వహణ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనందున వీటిని ఆపలేమని స్పష్టం చేసిన ఎన్‌జిటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థపై ఐదు కోట్ల జరిమానా విధించింది. ఇంతకు ముందు శ్రీశ్రీ రవిశంర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 11 నుంచి నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఎన్‌జిటికి తెలిపింది. అయితే, తాత్కాలిక నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదని మరో మంత్రత్వ శాఖ తెలియజేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఢిల్లీలోని యుమునా నది ఒడ్డున భారీ ఎత్తున ఈ ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించడంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవ నిర్వహణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని ఎన్‌జిటిని ఆశ్రయించారు. దీంతో ఈ కార్యక్రమానికి పర్యావరణ పరమైన అనుమతులు ఎలా ఇచ్చారంటూ కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలను ఎన్‌జిటి నిలదీసింది. అయితే ఈ వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని, మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా, యమునా నది ఒడ్డున జరిపే తాత్కాలిక నిర్మాణాలకు పర్యావరణానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌కు తెలియజేసింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎలాంటి అఫిడవిట్‌ను దాఖలు చేయనందుకు ట్రిబ్యునల్ మంత్రిత్వ శాఖను తీవ్రంగా మందలించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేసింది.
కాగా, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలినుంచి అనుమతులు తీసుకోకుండా యమునా నదిలో ఎలాంటి ఎంజైమ్‌లను వేయవద్దని విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. దీనికి ఫౌండేషన్ అంగీకరించింది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు తదనంతర పరిణామాలకు సంబంధించి ఏదయినా పర్యావరణ ప్రభావం అంచనా జరిపారా అని ట్రిబ్యునల్ కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ అభివృద్ధి అథారిటీ (డిడిఏ)ను విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఉత్సవం జరిగే ప్రాంతాన్ని తనిఖీ చేసిన తర్వాత పోలీసులు పంటూన్ బ్రిడ్జికి సంబంధించి స్ట్రక్చరల్ సేఫ్టీ క్లియరెన్స్, వాహనాల పార్కింగ్ అనుమతి ఉంటే చూపించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను అడిగారని ఢిల్లీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు తెలియజేసింది. నిర్మాణ సేఫ్టీకి సంబంధించిన సమస్యల కారణంగా ప్రధానమంత్రికోసం వేరుగా ఒక వేదికను నిర్మించాలని సెంట్రల్ పిడబ్ల్యుడి ఫౌండేషన్‌ను కోరినట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ వాదనను ఫౌండేషన్ తోసిపుచ్చుతూ ఈవెంట్ బాగా కనబడడం కోసం మాత్రమే తాము వేదికను నిర్మిస్తున్నట్లు తెలియజేసింది.