జాతీయ వార్తలు

83 లక్షల మంది సబ్సిడీ వదులుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో 83 లక్షల మంది ఎల్‌పిజి సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ‘గివ్ ఇట్ అప్’కు స్పందన బాగుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారంస్పష్టం చేశారు. సబ్సిడీల భారం తగ్గించుకునేందుకు కీర్తి పరిఖ్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీనిలో భాగంగా ఎల్‌పిజి సబ్సిడీలు వదులుకోవాలని సంపన్నవర్గాలకు పిలుపునిచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 83 లక్షల మంది ప్రజలు ఎల్‌పిజి సబ్సిటీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో మధ్యతరగతి వర్గం, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారని ప్రధాన్ చెప్పారు. సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మంత్రి అన్నారు. సహజ వాయువు ధరలు తగ్గినందున వినియోగదారునికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందన్న ప్రశ్నకు ‘ఎల్‌పిజి సిలెండర్లపై ఇప్పటికే సబ్సిడీ ఇస్తున్నాం’ అని బదులిచ్చారు. దారిద్య్రరేఖ దిగువున ఉన్నవారికి ఐదు కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళల పేరుతోనే కనెక్షన్లు ఇస్తామని, 2018-19 నాటికి దాన్ని పూర్తిచేస్తామని పెట్రోలియం మంత్రి తెలిపారు.