జాతీయ వార్తలు

ఇరాక్‌లో బందీలు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న భారతీయులు ఇప్పటికీ జీవించే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. పంజాబ్‌కు చెందిన దాదాపు 40 మంది గత ఏడాదిగా ఇరాక్‌లో బందీలుగా ఉన్నారు. ఉగ్రవాదుల చెరనుండి తప్పించుకున్నట్లుగా చెప్పుకున్న ఒక వ్యక్తి మిగతా అందరినీ ఉగ్రవాదులు చంపేసి ఉండవచ్చని ఇటీవల చెప్పాడు. ఒకవేళ భారతీయులు గనుక ఇరాక్‌లో చిక్కుపడిపోయి ఉంటే ప్రభుత్వం వారిని వెనక్కి తీసుకువచ్చి ఉండేదని, అయితే వారు ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్నారని బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సుష్మాస్వరాజ్ చెప్పారు. అంతేకాదు వాళ్లంతా చనిపోయి ఉంటారనే వాదనను తాను ఎంతమాత్రం విశ్వసించడం లేదని కూడా ఆమె చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం గనుక ఆ వ్యక్తి కథనాన్ని నమ్మి ఉంటే అందరూ చనిపోయినట్లు సభలోనే తాను చెప్పి ఉండేదాన్నని, అందుకే తాము వారికోసం వెతుకుతున్నామని ఆమె చెప్పారు. ఇటీవల జరిగిన అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, 15 మంది మంత్రుల సమావేశాన్ని ఆమె ప్రస్తావిస్తూ, భారతీయుందరూ ప్రాణాలతోనే ఉన్నట్లు రెండు ప్రధాన దేశాల నేతలు తనకు చెప్పారని కూడా సుష్మాస్వరాజ్ తెలిపారు. విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సుష్మాస్వరాజ్ చూపిస్తున్న చొరవను సభలో కొంతమంది బిజెడి, ఆప్ సభ్యులు ప్రశంసించారు. ఇదిలా ఉండగా ముడి చమురు ధరలు భారీగా పడిపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో విదేశాలనుంచి భారతీయులు పెద్దఎత్తున తిరిగి వస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా సుష్మాస్వరాజ్ చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనుకుంటోందో చెప్పాలని ఒక సభ్యుడు ప్రశ్నించగా, ఇది భవిష్యత్తులో తలెత్తబోయే సమస్య అని, ప్రభుత్వానికి దీని గురించి తెలుసునని సుష్మ చెప్పారు.