జాతీయ వార్తలు

పంతం నెగ్గించుకున్న విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు చరిత్రలో ఐదోసారి రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరించటంలో ప్రతిపక్షం విజయం సాధించింది. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా 94 ఓట్లు రాగా వ్యతిరేకంగా 61 ఓట్లు పడ్డాయి. రాజ్యసభలో ప్రతిపక్షానికే మెజారిటీ ఉందన్న సంగతి తెలిసిందే. సవరణ తీర్మానాన్ని ఉపసంహరించుకునేందుకు ఆజాద్ తిరస్కరించటంతో దీనిపై ఓటింగ్ జరగపక తప్పలేదు. అన్నిస్థాయిలో పోటీచేసే అధికారం ప్రజలకు ఉంటుందనే అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అంశం రాష్టప్రతి ప్రసంగంలో లేదు అనే అంశాన్ని రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానికి జోడించాలన్నది గులాం నబీ ఆజాద్ ప్రతిపాదించిన సవరణ. ఆజాద్ ప్రతిపాదించిన సవరణ తీర్మానం విజయం సాధించటంతో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఈ అంశాన్ని జోడించిన అనంతరం రాజ్యసభ ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరించటం ఇది ఐదోసారి. 1980 జనవరి 30న జనతా పార్టీ హయాంలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణ జరిగింది. ఆ తరువాత 1989 డిసంబర్ 29 తేదీనాడు విపి సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు మరోసారి సవరించారు. మూడోసారి 2001 మార్చి 12 తేదీనాడు వాజపేయి నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణ ప్రతిపాదించి విజయం సాధించారు. గత ఏడాది రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో సవరణ ప్రతిపాదించి ప్రతిపక్షాలు విజయం సాధించాయి. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావటంలోనూ, ఉన్నతస్థాయిలో ఉన్న అవినీతిని అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలం కావటం గురించి రాష్టప్రతి ప్రసంగంలో సూచించలేదన్నది సవరణ. అన్నిస్థాయిలో పోటీ చేసేందుకు ప్రజలకు హక్కు ఉన్నదనే అంశంపై తీర్మానం చేసే అధికారం, పరిధి రాజ్యసభకు ఉందా లేదా? అనే దానిపై సభలో రసవత్తరమైన చర్చ జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించన ఎన్నికలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై రాజ్యసభలో చర్చించేందుకు లేదా రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి జోడించే అధికారం, అవకాశం లేదని రాజ్యసభ నాయకుడు అరుణ్‌జైట్లీ వాదించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇదే వాదనను రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ ముందు పెట్టారు. అయితే అధికార పక్షం వాదనను సిపిఎం పక్షనేత సీతారామ్ ఏచూరి, గులాం నబీ ఆజాద్ తప్పుపట్టారు. సవరణ తీర్మానం రాష్ట్రాలకు సంబంధించిన అంశంపై ప్రతిపాదించలేదు, రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మాత్రమే వర్తిస్తుందని వారు వాదించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ ప్రతిపక్షం వాదనతో ఏకీభవించి ఈ మేరకు తన రూలింగ్ ఇచ్చారు.

బుధవారం రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్