అంతర్జాతీయం

మయన్మార్‌లో యాంటీ క్లైమాక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపీతా (మయన్మార్), మార్చి 9: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకు రావడానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ జరిపిన దశాబ్దాల పోరాటం పూర్తిస్థాయిలో కాకపోయినప్పటికీ కొంతమేరకైనా గురువారం ఫలించనుంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ఆమె దేశ నాయకురాలు కావడం లేదనేది ఇప్పటికే ఖాయమై పోయింది. సూకీ, లక్షలాది మంది ఆమె మద్దతుదారులు ఇనే్నళ్లుగా జరిపిన పోరాటం, పడిన కష్టాలతో పోల్చినట్లయితే ఇదో విధంగా యాంటీ క్లైమాక్సేనని చెప్పాలి. ఆమె నేతృత్వంలోని నేషనల్ పార్టీ ఏప్రిల్ 1న 2011నుంచి సైన్యం మద్దతుతో అధికారంలో కొనసాగుతున్న పార్టీనుంచి అధికార పగ్గాలు చేపట్టనుండడాన్ని బట్టి ఇదో చరిత్రాత్మక ఘట్టమనే చెప్పవచ్చు.
గురువారం పార్లమెంటు ఉభయ సభలు, రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో 25 శాతం స్థానాలను కలిగి ఉండే మిలిటరీ బ్లాక్‌లు తమ అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించడంతో దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడెవరో అందరికీ తెలిసిపోతుంది. అప్పటివరకు సూకీకి, ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే కొద్దిపాటి మందికి తప్పించి బయటివారెవరికీ ఆ అదృష్టశాలి ఎవరో తెలియదు. పార్లమెంటు ఉభయ సభల్లోను సూకీ పార్టీకి మెజారిటీ ఉన్నందున ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే హక్కును కలిగి ఉండడమేకాక, అధ్యక్ష అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం కూడా ఆ పార్టీకి ఉంది. రెండో స్థానంలో వచ్చిన ఇద్దరు అభ్యర్థులు ఉపాధ్యక్షులు అవుతారు.
అయితే 70 ఏళ్ల సూకీ మాత్రం అధ్యక్షురాలు కాలేరు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం విదేశీ భాగస్వామి, లేదా పిల్లలున్నవాళ్లు అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీల్లేను. సూకీ దివంగత భర్త, ఆమె కుమారులిద్దరు కూడా బ్రిటిష్ పౌరులే అయినందున ఆమెకు అధ్యక్షురాలు అయ్యే అవకాశం లేదు.