జాతీయ వార్తలు

రోజా పిటిషన్‌పై నేడే తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రోజా సస్పెన్షన్ ప్రతులను అందజేయడంలో ఆలస్యం చేసినందుకు సుప్రీం కోర్టు మండిపడింది. ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని తెలుగు రాష్టల్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధేశించింది. రోజా సస్పెన్షన్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందు సుదీర్ఘ వాదనాలు జరిగాయి. రోజా తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదన వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనల్లోని రూల్ 340(2) కింద ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే అది కేవలం అప్పటి సమావేశాల వరకే వర్తిస్తుందని, అయితే నిబంధనలను అతిక్రమించి రోజాను ఏడాది పాటు సంస్పెండ్ చేశారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం జరుగుతున్న ఏపి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు రోజను అనుమతించాలని కోరారు. ఈ సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించేందుకు వెళ్లగా తమ పిటిషన్‌ను స్వీకరించేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ నిరాకరించారని తెలిపారు.
దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏ అధికారంతో ఈ పిటిషన్‌ను నిరాకరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన ప్రతులను రోజాకు ఇవ్వాలని లేఖలు రాసినప్పటికీ తీవ్ర ఆలస్యం చేశారని, హైకోర్టు జోక్యంతో ఆలస్యంగా ప్రతులను అందిచారని ఇందిరా జైసింగ్ ధర్మాసనానికి వివరించారు. దీంతో ఈ ప్రతులను రోజాకు అందజేయడంలో ఎందుకు జాప్యం జరిగిందని సుప్రీం కోర్టు నిలదీసింది. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదన వినిపించేందుకు ప్రయత్నించగా, ఆయనపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రోజా దాఖలు చేసుకున్న మధ్యంతర పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నిర్ధేశిస్తూ, ఇందుకు సంబందించిన ఆదేశాలను హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపలని ధర్మాసనం ఆదేశించింది. మంగళవారం స్వయంగా సుప్రీం కోర్టుకు హాజరైన రోజా ఈ ఆదేశాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఉద్ధేశ్యపూర్వకంగానే తనను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించింది.