జాతీయ వార్తలు

ప్రాజెక్టుల్లో జాప్యం చేస్తే జైలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొత్తగా ఇళ్లను కొనుక్కుంటే అవి సకాలంలో పూర్తవుతాయా అన్న బెంగ ఇక అవసరం లేదు. ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేని రీతిలో రూపొందించిన స్తిరాస్తి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కఠినమైన నిబంధనలతో రూపుదిద్దుకున్న ఈ బిల్లుతో అనేక రకాలుగా ఇళ్లు కొనుక్కునే వారికి కొండంత ఊరట కాబోతోంది.ఈ నిబంధనలు ఉల్లంఘించే రియల్టర్లు, బిల్డర్లకు మూడేళ్ల కారాగారశిక్షతో పాటు జరిమానాలు విధించడానికి కూడా ఇది వీలుకల్పిస్తుంది. రాజ్యసభలో ఐదు రోజుల క్రితమే ఆమోదం పొందిన రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు- 2013ను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. స్తిరాస్తులకు సంబంధించిన అన్నిరకాల లావాదేవీలను పారదర్శకత, జవాబుదారీతనం పాదుగొల్పే విధంగా రూపొందిన ఈ బిల్లు అన్ని విధాలుగానూ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, అలాగే రియల్టీ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడానికి ఉద్దేశించిన రియల్‌ఎస్టేట్ నియంత్రణ అథారిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఇటు ఆవాసా, అటు వాణిజ్య ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాలను నియంత్రించడంతోపాటు అవి సకాలంలో పూర్తయ్యేలా చూడడం వినియోగదారులకు అందేలా చేయడం అన్నది ఈ అథారిటీల ప్రధాన లక్ష్యం. అన్ని రకాల అవాస, వాణిజ్య ప్రాజెక్టులను తప్పని సరిగా నియంత్రణ సంస్థల్లో నమోదు చేసుకోవాలి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. అప్పిలేట్ ట్రిబ్యునళ్లు 60 రోజుల్లోగా తమ పరిశీలనకు వచ్చిన కేసులు పరిష్కరించాల్సి ఉంటుంది. గతంలో రూపొందించిన బిల్లులో కేసులు పరిష్కారానికి సంబంధించి ఎలాంటి పరిష్కార గడువులేకపోవడం గమనార్హం. ఈ నిబంధనలు ఉల్లంఘించే ప్రమోటర్లకు మూడేళ్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బయర్ల విషయంలో ఏడాది జైలుశిక్ష విధిస్తారు. కేసుల తీవ్రతను బట్టి జైలుశిక్ష,జరిమానాలు కూడా విధిస్తారు. ‘ఏం చెప్పారో అది చేయండి. మాట నిలబెట్టుకోండి అన్న బలమైన సందేశాన్ని ఈ స్తిరాస్తి బిల్లు అందిస్తుంది’ అని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ తెలిపారు.

చిత్రం... లోక్‌సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు