జాతీయ వార్తలు

రాజకీయ హింసతో అట్టుడుకుతున్న కేరళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం/అలపుజ: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళ అప్పుడే రాజకీయ హింసాకాండతో అట్టుడుకుతోంది. అలపుజలోని ఎవూర్‌లో మంగళవారం తెల్లవారు జామున డివైఎఫ్‌ఐ కార్యకర్తలు సునీల్ కుమార్ (28) అనే యువజన కాంగ్రెస్ కార్యకర్తను కొట్టి చంపగా, తిరువనంతపురం జిల్లాలో బిజెపి, సిపిఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 30 మంది గాయపడ్డారు. డివైఎఫ్‌ఐకి చెందిన ఎనిమిది మంది మంగళవారం తెల్లవారు జామున 2 గంటలకు సునీల్ కుమార్ ఇంటికి వెళ్లి దాడి చేశారని, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సునీల్ కుమార్ ఆసుపత్రిలో కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. సునీల్ కుమార్ గతంలో డివైఎఫ్‌ఐ కార్యకర్తగా పనిచేసినట్లు తెలుస్తోందని, ఈ ఘటనకు సంబంధించి నలుగురు డివైఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టుచేసి మిగిలిన వారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇదిలావుంటే, తిరువనంతపురం జిల్లా కొట్టాయికోణంలో సోమవారం రాత్రి బిజెపి, సిపిఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 30 మంది గాయపడ్డారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు వి.మురళీధరన్ కూడా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరువనంతపురం జిల్లాలో మంగళవారం బిజెపి హర్తాళ్ నిర్వహించగా, కొట్టాయికోణంలో సిపిఎం కూడా హర్తాళ్ నిర్వహించింది.

ఒవైసీ వ్యాఖ్యలు సిగ్గుచేటు

రాజకీయ పార్టీల ఆగ్రహం తీవ్రంగా ఖండించిన బిజెపి

న్యూఢిల్లీ, మార్చి 15: ‘మెడపై కత్తిపెట్టి డిమాండ్ చేసినా భారత్ మాతాకీ జై అనను’ అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించడాన్ని బిజెపిసహా అన్ని రాజకీయ పార్టీలు నిరసించాయి. ‘్భరతదేశం మనందరికీ తల్లిలాంటింది. తల్లిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దీనికి ఎవరూ అతీతులుకారు. కొందరు ‘మేం భారత్ మాతాకీ జై కొట్టబోం’ అని చెప్పడం దురదృష్టకరం, సిగ్గుచేటు కూడా. ఇలాంటి శక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం అత్యంత దురదృష్టకరం’ అని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కొత్తతరానికి దేశభక్తి గురించి చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పిలుపునిచ్చిన మర్నాడే ఒవైసీ ‘్భరత్ మాతాకీ జై అనను’ అని వివాదాస్పద ప్రకటన చేశారు. మహారాష్టల్రోని ఉద్గిర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఒవైసీ ‘్భరత్ మాతాకీ జై అనకపోతే ఏం చేస్తారు భగవత్ సాహెబ్’ అని ప్రశ్నించారు. ‘నా మెడమీద కత్తిపెట్టినా నేను ఆ నినాదం చేయబోను’ అని హైదరాబాద్ ఎంపీ అన్నారు. అలా అనాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎంఐఎం అధినేత వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. భారతీయుల సెంటిమెంట్‌ను అగౌరపరిచేలా ఉన్న ఒవైసీ వ్యాఖ్యలను అందరూ ఖండించాలని బిజెపి నేత సిద్ధార్థనాథ్ అన్నారు. ఒవైసీ ప్రకటన విద్వేషాలు రెచ్చగొట్టేదిగా ఉందని అన్నారు. ఎంఐఎం ఎంపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ కూడా నిరసించారు. ‘ఒవైసీ భారత్ మాతాకీ జై అని అనలేకపోతే పాకిస్తాన్ వెళ్లొచ్చు’ అని శివసేన సలహా ఇచ్చింది. కాగా ఒవైసీ ప్రకటనను పట్టుకుని బిజెపి, శివసేనలు రాజకీయం చేస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు ఆజ్మీ ఆరోపించారు.

‘్భరత్ మాతాకీ జై’ అనడం నా అధికారం
రాజ్యసభలో ఉద్వేగానికి గురైన జావేద్ అక్తర్

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 15: అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనను ప్రముఖ సినీ రచయిత, కవి, రాజ్యసభ సభ్యుడు జావేద్ అక్తర్ తీవ్రంగా ఖండించారు. అక్తర్ మంగళవారం రాజ్యసభలో తన వీడ్కోలు ప్రసంగం చేస్తూ ‘తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఓ గల్లీలో ఉండే వ్యక్తి భారత్ మాతాకీ జై అని ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పనని ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలను నేను తీవ్రంగా నిరసిస్తున్నాను’ అని స్పష్టం చేశారు. భారత్ మాతాకీ జై అనాలని రాజ్యాంగంలో లేదు కాబట్టి గొంతుపై కత్తి పెట్టినా తాను ఆ మాటలు అననని ఒవైసీ వివాదాస్పద ప్రకటన చేశారు. షేర్వానీ ధరించాలని రాజ్యాంగంలో రాసి ఉందా? అని జావేద్ నిలదీశారు. ‘్భరత్ మాతాకీ జై అని చెప్పవలసిన అవసరం ఉన్నదా? లేదా? అనేది ముఖ్యం కాదు. భారత్ మాతాకీ జై అనటం నా అధికారం. అందుకే భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై’ అంటూ జావేద్ ఉద్వేగంతో నినదించారు. జావేద్ అక్తర్ ఈ మాటలంటున్నప్పుడు సభలో ఉన్న వారంతా బల్లలు చరుస్తూ అభినందించారు. ముస్లింలు, పాకిస్తానీయులు అన్న నినాదాన్ని కూడా ఖండిస్తున్నానని జావేద్ వెల్లడించారు. దేశంలో లౌకికవాదం ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం కొనసాగుతుంది, లౌకికవాదం దెబ్బతిన్నరోజు ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుందని ఆయన హెచ్చరించారు.