అంతర్జాతీయం

పోటీలో వాళ్లిద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లీవ్‌లాండ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్‌ల మధ్య ముఖాముఖి పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం పలు కీలక రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రత్యర్థులకన్నా ముందున్న ఈ ఇద్దరూ తమ ఆధిక్యతలను మరింత పెంచుకునేలా భారీ విజయాలను సాధించారు. ఇప్పటికే గణనీయమైన డెలిగేట్ల ఆధిక్యత కలిగి ఉన్న ట్రంప్ మరో మూడు రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఫ్లోరిడాలో ట్రంప్ సాధించిన తిరుగులేని విజయంతో ఆ రాష్ట్రానికి చెందిన సెనేటర్, ప్రత్యర్థుల్లో ఒకరైన మార్క్ రుబియో పోటీనుంచే తప్పుకునేలా చేసింది. ఫ్లోరిడాలో ట్రంప్ మొత్తం 99 మంది పార్టీ డెలిగేట్ల మద్దతు సాధించడమే కాకుండా తిరుగులేని విజయం సాధించారు. ఆయన ఫ్లోరిడా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినాలలో తిరుగులేని విజయం సాదించారు కానీ పార్టీలో తన ప్రత్యర్థుల్లో ఒకరైన ఓహియో గవర్నర్ జాన్ కసిచ్ చేతిలో ఆయన సొంత రాష్ట్రంలో ఓడిపోయారు. మరోవైపు 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ ఫ్లోరిడా, నార్త్ కరోలినా రాష్ట్రాలతో పాటుగా పారిశ్రామిక కేంద్రాలయిన ఓహియో, ఇల్లినాయిస్‌లలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన బెర్నీ శాండర్స్‌పై విజయం సాధించడం ద్వారా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని సాధించే దిశగా మరింత ముందుకు దూసుకెళ్లారు. ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరు కూడా డెలిగేట్ల మద్దతు విషయంలో తమ ప్రత్యర్థులకన్నా ఎంతో ముందున్నారు. అయితే ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి అవసరమైన సంఖ్యకన్నా ఇంకా దూరంలోనే ఉన్నారు. ట్రంప్‌కు తన సమీప ప్రత్యర్థి అయిన టెడ్ క్రుజ్‌కన్నా 200కు పైగా డెలిగేట్ల ఆధిక్యత ఉంది. పోటీలో విజయం సాధించి వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థిగా దాదాపు ఖాయంగా కనిపిస్తున్న హిల్లరీ క్లింటన్‌ను ఓడించి తీరుతానన్న ధీమాను మయామీలో జరిగిన విక్టరీ ర్యాలీలో ట్రంప్ వ్యక్తం చేశారు. తాజా ప్రైమరీ ఫలితాలను బట్టి హిల్లరీ క్లింటన్ డెమ్రోక్రటిక్ పార్టీ తరఫున మొట్టమొదటి మసిళా అధ్యక్ష అభ్యర్థి కావడం దాదాపు ఖాయమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ట్రంప్‌ను విమర్శించడానికి ఆమె ఉపయోగించుకున్న విజయ ప్రసంగంలో సైతం ఇది చాలా స్పష్టంగా కనిపించింది. విదేశాలనుంచి వలస వచ్చిన దాదాపు కోటీ 20 లక్షల మందిని దేశంనుంచి పంపించి వేయాలని, ముస్లింలు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధించాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబడుతూ, మనం బారికేడ్లను కూల్చివేయాలే తప్ప అడ్డుగోడలను నిర్మించకూడదని అన్నారు. గొప్పవారుగా ఉండాలనే చిన్న బుద్ధులుండకూడదని, అమెరికాను గొప్ప దేశంగా చేసిన హుందాతనాన్ని కోల్పోకూడదని కూడా హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రస్తుతం హిల్లరీ క్లింటన్‌కు 1561 మంది ప్రతినిధులుండగా, ఆమె సమీప ప్రత్యర్థి అయిన శాండర్స్‌కు 800 మంది ప్రతినిధులున్నారు. అధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు వచ్చే జూన్‌లో ఫిలడెల్ఫియాలో జరగబోయే పార్టీ మహాసభ నాటికి తన అభ్యర్థిత్వం ఖరారు కావడానికి మొత్తం 4,763 మంది ప్రతినిధుల్లో ఆమెకు 2,382 మంది ప్రతినిధులుండాలి.