నెల్లూరు

భక్తులతో కొండ బిట్రగుంట కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, మార్చి 19:ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం బిలకూట క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని పలు గ్రామాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా విచ్చేశారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి కొండ మెట్లకు, ఔవరబోది వృక్షం (అత్తిచెట్టు)కు పసుపుకుంకమ రాసి పూజలు చేశారు. ప్రధాన అర్చకులు వేదగరి నరసింహాచార్యులు, యాజ్జీకులు వంశీకృష్ణమాచార్యులు బృందం పుష్కరిణి నుంచి కడవలతో నీరు తీసుకుని వచ్చి ఉత్సవమూర్తులు, ఆళ్వారు సన్నిద్ధిని శుద్ధి చేశారు. మంగళవాయిద్యాల మధ్య స్వామిఅమ్మవార్లకు మంగళస్నానం చేయించి తిరుమంజన సేవ చేశారు. ఈ కార్యక్రమానికి ముసునూరుకు చెందిన నారపూచి వెంకటనరసయ్య కుటుంబ సభ్యులు, జూటూరు శివరామకృష్ణమూర్తి ఉభయకర్తలుగా వ్యవహరించారు. రాత్రి ధ్వజారోహణ, శేషవాహన సేవ, కొడిముద్దలు స్వీకరణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.