నెల్లూరు

నాసాకు ఎంపికైన శ్రీ చైతన్య విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, మార్చి 19: నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా వారు వరల్డ్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ 2016 ఫలితాల్లో వెంకటగిరి శ్రీ చైతన్య విద్యార్థులు ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల ఎజిఎం హనుమంతరావు తెలిపారు. శనివారం స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో నాసాకు ఎంపికైన 9 మంది విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎజిఎం హనుమంతరావు మాట్లాడుతూ 2016 కాంటెస్ట్‌లో జగత్ (ద ఫీచర్ ఆఫ్ మ్యాన్‌కైండ్) అనే అంశంపై నిర్వహించారని చెప్పారు. భూమిపై సునామీలు, భూకంపాలు లాంటివి సంభవించినపు మానవుడు అంతరిక్షంలో ఎలా వెళ్లాలి, ఏవిధంగా జీవించాలన్న దానిపై వెంకటగిరి శ్రీచైతన్య విద్యార్థులు తయారుచేసిన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించారని తెలిపారు. గత మాడు సంవత్సరాలుగా నాసా కాంటెస్ట్‌లో శ్రీ చైతన్య విద్యార్థులు విజయం సాధిస్తూనే వస్తున్నారని, ఈ సంవత్సరం ప్రపంచ స్థాయిలో వెంకటగిరి విద్యార్థులు మొదటి స్థానం సాధించడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఈ ప్రాజెక్టులో విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చిన సిబ్బందికి, ప్రిన్సిపాల్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం నాసాకు ఎంపికైన విద్యార్థులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రీజనల్ ఇన్‌చార్జ్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులను ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో కష్టపెట్టి చేయించామని, అందుకు ప్రతిఫలం ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించుకోగలిగామన్నారు. విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా ఇలాంటి సాంకేతిక విషయాల్లో కూడా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పాఠశాల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. నాసాకు ఎంపికైన వారిలో ఎనిమిదవ తరగతికి చెందిన వై లీలాకృష్ణ, సి శశికిరణ్, ఏడవ తరగతికి చెందిన టి భావన, పి నితిన్‌కుమార్, బి హితేష్, సిహెచ్ గురు విశ్వసౌరబ్, వి మునికార్తీక్, తొమ్మిదవ తరగతికి చెందిన ఎం శ్రీహర్ష, జి హరిష్ ఉన్నారని తెలిపారు. వీరంతా మే 18న నాసాలో జరిగే సాంకేతిక సదస్సులో పాల్గొని వారు తయారుచేసి పంపిన జగత్ ద ఫీఫ్యిచర్ ఆఫ్ మ్యాన్‌కైండ్‌ను వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎవో సుధాకర్‌రెడ్డి, డీన్ పరంధామయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, సలహాలు ఇచ్చిన పాఠశాల సిబ్బంది ఆదిత్య పాల్గొన్నారు.