నెల్లూరు

రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, మార్చి 19: రైతులు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ ఎం జానకి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న జిల్లా పరిషత్ సభా మందిరంలో ఉద్యాన రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోవడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు ఆర్థిక స్వాలంబన సాధించే దిశగా తగు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత కల్పించామని, అదేతరహాలో రైతు సంఘాలను ఏర్పాటుచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నాబార్డు ఆర్థిక సహాయంతో వారికి అవసరమైన పరికరాలను, యంత్రాలను అందజేయడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఆ దిశగా తొలుత నిమ్మ రైతులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అందుబాటులో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారని, అలాకాకుండా ఆ ఉత్పత్తులను రైతులే నేరుగా మార్కెట్ చేసుకునేలా ఈ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడాలని జిల్లాలో ఈ విధానాన్ని అమలుచేసేందుకు రైతుల నుండి సలహాలు, సూచనలు తీసుకునేందుకు వర్క్‌షాప్‌లు దోహదపడతాయన్నారు. భవిష్యత్‌లో సంక్షేమ పథకాలను రైతు గ్రూపుల ద్వారా అమలుచేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సదస్సులో అదనపు సంయుక్త కలెక్టర్ ఎస్ రాజ్‌కుమార్, వ్యవసాయ శాఖ జెడి హేమమహేశ్వరరావు, మత్స్యశాఖ జెడి సీతారామరాజు, ఆత్మ పిడి రామరాజు, ఉద్యానవన శాఖ అధికారులు రవీంద్రబాబు, అనూరాధ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంకె శ్రీనివాసులు, ఎపిడి వెంకటేశ్వర్లురెడ్డి, ఎడిఎం ఉపేంద్రకుమార్, నాబార్డు ఎజిఎం రమేష్‌బాబు, సెరి కల్చర్ పిడి కుల్లాయరెడ్డి, రైతులు పాల్గొన్నారు.