నెల్లూరు

ఘనంగా ప్రారంభమైన అళఘనాథుని బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, మార్చి 19: గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ధ్వజారోహణం, చిన్న శేషవాహనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, రాత్రికి పెద్ద శేషవాహనం కార్యక్రమాలను నిర్వహించారు. ధ్వజారోహణం సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం కొడిముద్దల కోసం పలువురు పిల్లలు లేని మహిళలు వాటిని అందుకొనేందుకు పోటీ పడ్డారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి చిన్న శేషవాహనంపై ఆలయంలో ఊరేగించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి ఉభయకర్తలుగా బొంతల వెంకటేశ్వర్లు, బిరుదురాజు శ్రీహరి, పుష్పలత వ్యవహరించారు.