జాతీయ వార్తలు

విద్యుత్ లైన్ల పనులు ఏడు నెలల్లో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరాది నుండి దక్షిణాది గ్రిడ్ విద్యుత్ సరఫరా లైన్ల పనులు ఏడు నెలల్లో పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ దత్తాత్రేయతో ఆదివారం సాయంత్రం సమావేశం అయ్యారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య జరిగిన విద్యుత్ అంశంతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించమన్నారు. దక్షిణాది గ్రిడ్ పనులు పూర్తి అయితే తెలంగాణకు విద్యుత్ ఇబ్బందులు ఉండవన్నారు. చత్తీస్‌గఢ్‌లో అమలవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ ఆదర్శవంతంగా ఉందని, దానిని తెలంగాణలో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణకు విద్యుత్ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ హామీ ఇచ్చారన్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాయ్, కూర్బా ప్రాంతాలలో ఇఎస్‌ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని రమణ్‌సింగ్ కోరినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 4న చత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తానని దత్తాత్రేయ తెలిపారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమీక్షించినట్లు చెప్పారు. ఈ రెండు సంవత్సరాల పాలనపై చర్చించామని, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించలేదని దత్తాత్రేయ తెలిపారు.

తాత్కాలిక సచివాలయం
నిర్మాణాల్లో అవకతవకలు
విభజన చట్టానికి విరుద్ధంగా కట్టడాలు
జోక్యం చేసుకోవాలని ప్రధానికి కెవిపి వినతి
న్యూఢిల్లీ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టారు, దీనివలన రాష్ట్ర ఖజానాకు ఎంతో నష్టం వాటిల్లుతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. కొత్త రాజధాని నిర్మాణాన్ని పక్కనబెట్టి తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టారని రామచందర్ రావు ప్రధాన మంత్రికి రాసిన లేఖలో తెలిపారు. నరేంద్ర మోదీకి ఈ నెల ఐదోతేదీనాడు రాసిన ఈ లేఖను ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను అదుపు చేసేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. హరిత రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాలపై గత సంవత్సరం డిసెంబర్ 19 తేదీనాడు రాసిన లేఖకు వెంటనే స్పందించిన నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తానీ లేఖలో చేసిన సూచనలు, సలహాలపై తీసుకున్న నిర్ణయాలపై ఆయా మంత్రిత్వ శాఖల నుండి తనకు ఎలాంటి సమాధానం రాలేదని రామచందర్‌రావు ప్రధాన మంత్రికి తన రెండవ లేఖలో ఫిర్యాదు చేశారు. 200 మీటర్ల వెడల్లుతో కూడుకున్న 217 కిలోమీటర్ల రహదారులు, మూడు వందల కిలోమీటర్ల రింగు రోడ్డు, కృష్ణా నదిపై సిగ్నేచర్ వంతెన, పరిశ్రమల స్థాపన తదితర పథకాలకు అనుమతి ఇవ్వటంపై కేంద్ర పర్యావరణ శాఖకు కూడా ఒక లేఖ రాసినట్లు ఆయన వివరించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం, ఈఐఏ-2006 మార్గదర్శకాల ప్రకారం ఈ అభివృద్ది కార్యక్రమాలన్నీ ‘ఏ’ క్యాటగిరీ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి, అయితే కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఎస్‌ఈఐఏఏ సంస్థ ఎలాంటి పరిశీలన, తనిఖీ, విశే్లషణ జరపకుండానే అనుమతులు మంజూరు చేసిందని రామచందర్‌రావు ఆరోపించారు. ఈ విషయాలన్నింటిపై లోతుగా దర్యాప్తు జరిపించి తగు చర్యలు తీసుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలని రామచందర్‌రావు ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.