జాతీయ వార్తలు

నేతాజీ, భగత్‌సింగ్ దేశభక్తులు కారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘్భరత్ మాతాకీ జై’ అని అనడం ఒక వ్యక్తి దేశభక్తికి నిదర్శనం అని బిజెపి చేస్తున్న వాదనను కాంగ్రెస్ పార్టీ ఆదివారం తప్పుబడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లాంటి వారిని ఆ పార్టీ ఏ విధంగా పరిగణిస్తుందో చెప్పాలని ప్రశ్నించింది. ‘నేతాజీ జైహింద్ అన్నారు, భగత్ సింగ్, ఇంక్విలాబ్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని అన్నారు. అయితే బిజెపి మాత్రం భారత్ మాతాకీ జై తప్ప మిగతావన్నీ కూడా దేశ వ్యతిరేకమైనవేనని అంటోంది’ అని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘మెడమీద కత్తి పెట్టినా సరే తాను భారత్ మాతాకీ జై అనను’ అని అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దేశాన్ని విమర్శిస్తే తమ పార్టీ సహించదని, దేశ వ్యతిరేక నినాదాలు చేయడానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఒక సాకు కాబోదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభిస్తూ స్పష్టం చేశారు.

మిలిటెంట్ల అడ్డాగా
దక్షిణ కాశ్మీర్

అనంత్‌నాగ్, మార్చి 20: కాశ్మీర్‌లో రాజకీయంగా అత్యంత సున్నిత ప్రాంతంగా పరిగణిస్తున్న దక్షిణ కాశ్మీర్ ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలకు ఉత్పత్తి కేంద్రంగా మారింది. నాలుగు జిల్లాలు అనంత్‌నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియాన్‌లకు చెందిన అనేక మంది యువత మిలిటెంట్లుగా మారడమో లేదా వారి సానుభూతిపరులుగా మారడమో జరిగింది. ఉగ్రవాదులకు ఈ ప్రాంతంలో మంచి ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఉండటం, స్థానిక ఉగ్రవాదులకు ప్రజలు సహకరిస్తుండటం, మిలిటెంట్ల అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటం, ఎన్‌కౌంటర్ల సందర్భంగా భద్రతా బలగాలపై ప్రజలు రాళ్లు రువ్వుతుండటం వంటివి ఈ ప్రాంతంలో తరచుగా జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో నిషిద్ధ లష్కర్ ఎ తోయిబా చీఫ్ కమాండర్ అబు ఖాసిం భీకర ఎన్‌కౌంటర్‌లో హతమైనప్పటి నుంచి దక్షిణ కాశ్మీర్ అట్టుడుకుతోంది. గత సంవత్సరం 90 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వారిలో 80 శాతం మంది ఒక్క దక్షిణ కాశ్మీర్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కుల్గాం, పుల్వామా, త్రాల్ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకు చెందిన 17 మంది యువకులు కనిపించకుండా పోయారని, వీరంతా ఉగ్రవాద సంస్థల్లో చేరి ఉంటారని నిఘా వర్గాల సమాచారం.

దేశవ్యాప్తంగా 908 ఐపిఎస్ పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ, మార్చి 20: దేశవ్యాప్తంగా 908 ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 114 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 4,802 ఐపిఎస్ పోస్టులు ఉండగా, వీటిలో 2016 జనవరి ఒకటి నాటికి 908 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,894 మంది ఐపిఎస్ అధికారులు పనిచేస్తున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన మరో 140 మంది ఐపిఎస్ అధికారులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 517 పోస్టులు ఉండగా, 114 ఖాళీగా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో 347 పోస్టులకు గాను 88 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒడిశాలో 188 పోస్టులకు గాను 79 పోస్టులు, కర్ణాటకలో 215 పోస్టులకు గాను 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యుపిఎస్‌సికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా వివిధ కోర్టులో దాఖలయిన కేసులు కూడా ఈ పోస్టుల భర్తీకి ఒక ఆటంకంగా మారిందని హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.