జాతీయ వార్తలు

మోదీ అసలు రూపం బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి బిజెపి, దాని ధనబలమే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని అధికార పార్టీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన ఆరోపించారు. భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని రాహుల్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. బిజెపి ప్రదర్శిస్తున్న ఈ ధోరణిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ పరిణామాలపై కేంద్రం, ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ ట్వీట్లలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకుంటున్నారని, దీనికోసం బిజెపి తనకున్న అధికార, ధనబలాన్ని ప్రయోగిస్తోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ధోరణి బిజెపిలో మరింత పెరిగిందని అన్నారు. ‘ప్రజా ప్రభుత్వాలను కూల్చివేయడం ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా దాడి చేయడం లాంటిదే. మొన్న అరుణాచల్‌ప్రదేశ్, ఈరోజు ఉత్తరాఖండ్. మోదీ నాయకత్వంలోని బిజెపి అసలు స్వరూపం ఇదే’నని రాహుల్ విమర్శించారు.
మునిగిపోతున్న ఓడ కాంగ్రెస్: బిజెపి
‘తీవ్రమైన నాయకత్వ సమస్య’ వల్ల కాంగ్రెస్ పార్టీ ‘మునిగిపోతున్న ఓడ’ స్థితికి చేరిందని, అందుకే ఆ పార్టీకి చెందిన నాయకులు బయటకు వస్తున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఆదివారం ఇక్కడ విమర్శించారు. ఓడ మునిగిపోకముందే అవకాశమున్నంత వరకు బయట పడాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బిజెపిని నిందించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా అసమ్మతి కొనసాగుతోందని, అసమ్మతి కారణంగానే గతంలో అప్పటి ముఖ్యమంత్రి విజయ్ బహుగుణను తొలగించారని, ఇప్పుడు మరో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి బయల్దేరిందని శ్రీకాంత్ శర్మ పేర్కొన్నారు.

సమాజాన్ని చీల్చే శక్తులను
ఎందుకు అదుపు చేయరు?

మోదీ సర్కార్‌కు గులాం నబీ ఆజాద్ లేఖ

న్యూఢిల్లీ, మార్చి 20: ఎన్నికల ప్రయోజనాలకోసం మత విద్వేషాలను, అవిశ్వాసాన్ని రెచ్చగొడుతున్న సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉన్నవారిని మోదీ ప్రభుత్వం అదుపు చేయలేక పోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, కులాలు, మతాల వారీగా సమాజాన్ని చీల్చాలన్న ఉద్దేశపూర్వక వ్యూహంలో అది ఒక భాగమనే అనుమానానికి ఇది తావిస్తోందని పేర్కొంది. జార్ఖండ్‌లోని లాటేహార్ జిల్లాలో ఇద్దరు పశువుల వ్యాపారులను మతోన్మాదులు చిత్రహింసలకు గురిచేసి చెట్టుకు ఉరివేసి చంపిన తాజా సంఘటన సహా దేశంలో మైనారిటీలపై పెరిగిపోతున్న దాడులను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. మూకుమ్మడి హింసాకాండకు సంబంధించిన అలాంటి సంఘటనలు దేశంలో ప్రజాస్వామ్యం లేదేమోననే అనుమానాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు కల్పిస్తాయేమోననే ఆందోళన కలుగుతోందని ఆజాద్ ప్రధానికి రాసిన రెండు పేజిల లేఖలో పేర్కొన్నారు. మత విద్వేషం, మతాల వారీగా సమాజాన్ని చీల్చే ధోరణులు పెరిగిపోతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, సభ్య సమాజం ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూనే ఉన్నాయని, అయితే అలాంటి శక్తులను అదుపు చేయడానికి ప్రభుత్వం కానీ, బిజెపి నాయకులు కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆజాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.