జాతీయ వార్తలు

అభివృద్ధే మన అజెండా కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు లేవనెత్తే అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవద్దని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మంత్రానే్న అజెండాగా చేసుకుని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి కార్యకర్తలకు ఆదివారం పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగంలోను, సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలోను జాతీయ వాదంపై చర్చ ప్రధానాంశం కాగా, మోదీ మాత్రం తన ప్రభుత్వం చేపట్టిన పనులకే తన ప్రసంగంలో ఎక్కువ సమయాన్ని కేటాయించారు.
‘అనవసర అంశాల్లోపో మనం తలదూర్చరాదు. మన అజెండాపైనే మనం పని చేయాలి. ప్రజలు అనవసర విషయాల్లో తల మునకలుగా ఉండడానికి, ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చర్చించకుండా ఉండేలా చూడడానికే మన ప్రత్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మనం ఒకే ఒక మంత్రం ‘వికాస్’( అభివృద్ధి)తోనే ముందుకు సాగాలి. మన దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇదే సమాధానం, పార్టీ, ప్రభుత్వం భుజం భుజం కలిపి ముందుకు సాగాలి’ అని మోదీ అన్నారు. ప్రధాని ప్రసంగం గురించి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాకు వివరించారు.
రాజకీయ తీర్మానం
కాగా, జాతీయతా వాదంపై చర్చ ఇప్పుడు దేశమంతటా ప్రధాన చర్చినీయాంశంగా మారిన నేపథ్యంలో భావప్రకటన దేశ విచ్ఛిన్నానికి హక్కును ఇవ్వబోదని బిజెపి ఆదివారం స్పష్టం చేసింది. ఇక్కడ జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం చివరి రోజున ఆమోదించిన రాజకీయ తీర్మానంలో సైతం ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేవాలను ప్రారంభిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశంపై దాడిని బిజెపి ఎంతమాత్రం సహించబోదని చెప్పడం ద్వారా ఈ చర్చకు బీజం వేసిన నేపథ్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో జాతీయతా వాదం అంశం ప్రధాన చర్చనీయాంశం అయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, జాతీయతా వాదం రెండూ స్వేచ్ఛగా మనుగడ సాగించాల్సిన అవసరం ఉందని, ఏ అంశాన్నయినా వ్యతిరేకించడానికి రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, అయితే దేశ విచ్ఛిన్నానికి మాత్రం కాదని రెండోరోజు సమావేశం వివరాలను మీడియాకు వివరిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జాతీయ వాద సిద్ధాంతం, మా విశ్వాసాలకు, సిద్ధాంతానికి మూలమని ఆయన అంటూ, ఇటీవల జెఎన్‌యులో జరిగిన ఘటనలపై కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టడంలో సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకుల్లో ఎంతో ఉత్సుకత కనిపించిందని స్పష్టం చేశారు. ‘్భరత్ మాతాకీ జై’ నినాదంపై వివాదంపై కూడా పార్టీ చర్చించిందా అని అడగ్గా, ఇది చర్చ జరగాల్సిన అంశం కాదని పార్టీ భావిస్తోందని జైట్లీ చెప్పారు. ఈ నినాదం విషయంలో ప్రజలకు ఎలాంటి సమస్యా లేదని చెప్పిన ఆయన ‘శనివారం కోల్‌కతాలో ఈ విషయాన్ని మనం చూశాం’ అని అన్నారు. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాదించిన తర్వాత ప్రేక్షకులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ బలం రోజురోజుకు క్షీణించి పోతోందని జైట్లీ అంటూ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని దిగజార్చుకుని బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో ఏ కూటమికైనా తోకపార్టీగా ఉండడానికి సైతం సిద్ధపడుతోందని అన్నారు. ఉత్తరాఖండ్, జమ్మూ, కాశ్మీర్‌లలో ప్రభుత్వం ఏర్పాటు అంశం సమావేశంలో చర్చకు రానప్పటికీ జమ్మూ, కాశ్మీర్ కూటమి అజెండాకు పార్టీ కట్టుబడి ఉన్నట్లు తీర్మానం స్పష్టం చేసిందని జైట్లీ తెలిపారు.