జాతీయ వార్తలు

కోటా ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఎవ్వరూ లాగేసుకోలేదని, అది వారి హక్కు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఢిల్లీలో సోమవారం భారత నిర్మాత బిఆర్ అంబేద్కర్ 6వ స్మారకోపన్యాస కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ, దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లను మార్చటం లేదా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రిజర్వేషన్లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం జరిగిందని, అయినప్పటికీ బిజెపి హయాంలో రిజర్వేషన్ల కోటాకు ఎలాంటి భంగం కలగలేదని ప్రధాని తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా నిజమైన అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మోదీ పై వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రిజర్వేషన్ల వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్ పలు రకాల ప్రకటనలు చేయటం వలన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవడంతో పాటు ఆ తర్వాత కూడా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల వివాదానికి శాశ్వతంగా తెర దించేందుకే మోదీ ఈ వివరణ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ప్రముఖ పౌర హక్కుల నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండెలా తదితరులతో అంబేద్కర్‌ను పోలుస్తూ, ఆయన గౌరవార్థం ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి స్మారకాన్ని నిర్మిస్తామని మోదీ ప్రకటించారు. గత ప్రధాన మంత్రులెవ్వరూ అంబేద్కర్ స్మారకోపన్యాసం ఇవ్వలేదని మోదీ పేర్కొంటూ, బడుగు, బలహీన వర్గాలకు తాను సముచిత ప్రాధాన్యత ఇస్తున్నానే సందేశాన్ని పంపించేందుకు ప్రయత్నించారు. అంబేద్కర్‌ను కేవలం దళితల దేవుడని చిత్రీకరించటం తప్పని, ఆయన సమాజంలోని అన్ని వర్గాల పీడిత ప్రజల కోసం పని చేశారని మోదీ చెప్పారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు. హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదిస్తున్నప్పుడు మహిళల హక్కుల కోసం అంబేద్కర్ అవిశ్రాంత పోరాటం చేశారని, దేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ ఎంతో అవసరమని చెబుతూనే కార్మిక సంస్కరణలు చేపట్టాలని సూచించారని ప్రధాని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు ఇప్పటికీ ఆచరణయోగ్యమేనని, దేశ అభ్యున్నతికి సముద్ర, ఇంధన వనరులను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై అంబేద్కర్‌కు స్పష్టమైన ఆలోచన ఉండేదన్నారు. అంబేద్కర్ మూలంగానే దేశంలో కార్మిక చట్టాలు ఏర్పడటంతోపాటు వారి హక్కుల పరిరక్షణ జరిగిందని మోదీ ప్రశంసించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 60 ఏళ్ల తర్వాత కూడా అంబేద్కర్‌కు స్మారకం లేకపోవటం చాలా దురదృష్టకరమని ప్రధాని విచారాన్ని వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కలలుగన్న విధంగా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఏప్రిల్ 14 తేదీ నుంచి ఇ-మార్కెటింగ్ వేదికను ప్రారంభిస్తుందని మోదీ ప్రకటించారు. ఇందులో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన తాజా మార్కెట్ రేట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంతకుముందు మోదీ ఢిల్లీలోని 26 అలీపూర్ రోడ్డులో నిర్మిస్తున్న అంబేద్కర్ జాతీయ స్మారక భవనానికి విజ్ఞాన్ భవన్ నుండి శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని 2018 ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభిస్తానని మోదీ ప్రకటించారు. అలాగే అంబేద్కర్ గౌరవార్థం ఐదు ప్రాంతాలను పంచతీర్థగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని సమైక్య పరిస్తే రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ దేశంలో సామాజిక సమైక్యత సాధించారని మోదీ ప్రశంసించారు.
chitram...
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం వద్ద
వినమ్రంగా నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ