జాతీయ వార్తలు

మీరే తేల్చండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్/న్యూఢిల్లీ:ఉత్తరాఖండ్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం సోమవారం ముదురుపాకాన పడింది. మరోవారంలో ముఖ్యమంత్రి రావత్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్, బిజెపిలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. చకచకా సాగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరుపార్టీలు రాత్రి పొద్దుపోయిన తర్వాత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నాయి.రావత్ సర్కార్‌ను బర్త్ఫ్ చేయాలని బిజెపి పట్టుబడితే..రాష్ట్రంలో తలెత్తిన కుట్ర వెనుక కేంద్రం హస్తముందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ చేసింది. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం పథకం వేసిందన్న కాంగ్రెస్ తిరుగుబాటుకు సూత్రధారులుగా భావిస్తున్న సీనియర్ నాయకులు సాకేత్, అనిల్ గుప్తాలను బహిష్కరించింది. మరో పక్క విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రావత్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదని, ఏడాదికో ముఖ్యమంత్రి మారితే అభివృద్ధి అడుగంటి పోతుందని డెహ్రాడూన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో అన్నారు. పగలంతా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌ను వేడెక్కించిన రాజకీయాలు హస్తినకు చేరుకోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్టప్రతి ప్రణబ్‌ను కలుసుకుని రావత్ సర్కార్‌కు అసెంబ్లీలో మెజార్టీ లేదన్నారు. వెంటనే ఆయన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను కూడా రాష్టప్రతి భవన్‌కు తీసుకెళ్లాలని మొదట భావించినప్పటికీ అనంతరం ఆ ఆలోచన మానుకున్నారు. బిజెపి, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పట్టుబట్టినప్పటికీ ఆర్థిక బిల్లును ఆమోదించినట్టుగా స్పీకర్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని బిజెపి నాయకులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ దృశ్యాల వీడియోలు చూడాలని రాష్టప్రతిని కోరారు. అనంతరం ఎకె ఆంటోనీ సారధ్యంలో గులాం నబీ అజాద్, కపిల్ సిబల్ తదితర నేతలతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్టప్రతిని కలుసుకుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యల ద్వారా రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల్ని సృష్టిస్తోందని కాంగ్రెస్ బృందం ఆయనకు స్పష్టం చేసింది. చట్ట, రాజ్యాంగ పాలన సక్రమంగా జరిగేలా చూడాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్ని సాకుగా చూపి కేంద్ర పాలన విధించేందుకు ఎలాంటి ప్రయత్నం జరిగినా అది అన్యాయమే అవుతుందని రాష్టప్రతికి నివేదించింది.