అంతర్జాతీయం

జికా వ్యాక్సీన్ దిశగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి: ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో నవజాత శిశువులపై ప్రభావం చూపిస్తున్న ప్రాణాంతకమైన జికా వైరస్‌పై పోరాడే వ్యాక్సీన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులు కొనసాగుతున్న అయిదు దేశాల్లో భారత్ కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్ చెప్పారు. కేవలం ఏడాదికన్నా తక్కువ కాలంలోనే జికా చిన్న తేలికపాటి వైద్యపరమైన సమస్య నుంచి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే వ్యాధిగా మారిపోయిందని ఆమె చెప్తూ, దీనిగురించి వివరాలు తెలిసేకొద్దీ అది మరింత తీవ్రం దాల్చవచ్చని కూడా చెప్పారు. ప్రస్తుతం 30కి పైగా కంపెనీలు ఈ వైరస్‌ను అదుపు చేసే వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులపై కృషి చేయడమో లేదా కొత్త వ్యాధి నిర్ధారణ పరీక్షలను అభివృద్ధి చేయడమో చేస్తున్నాయని ఆమె తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, భారత్, ఆస్ట్రియా దేశాల్లోని 14 వ్యాక్సీన్‌ను తయారు చేసే కంపెనీలు 23 ప్రాజెక్టులపై కృషి చేస్తున్నాయని కూడా చాన్ చెప్పారు.
నవజాత శిశువుల్లో పుట్టిన నెల రోజుల్లోపలే అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న జికా అంటువ్యాధిని డబ్ల్యుహెచ్‌ఓ అంతర్జాతీయ ప్రజారోగ్య ఎవర్జెన్సీగా ప్రకటించింది కూడా. ప్రస్తుతం ఈ వైరస్ 38 దేశాల్లో విస్తరించి ఉందని చాన్ ఒక ప్రకటనలో అంటూ, ఒక వేళ ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో అది త్వరలోనే ప్రపంచానికంతటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందని హెచ్చరించారు. ఈ వైరస్‌ను కచ్చితంగా గుర్తించగలిగే విశ్వసనీయమైన డయాగ్నసిస్ పరీక్ష ఇప్పుడు అత్యవసరంగా అవసరమని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఏడాది చివరినాటికల్లా కొన్ని ప్రాజెక్టులు ప్రయోగశాల పరీక్షల స్థాయికి చేరుకోగలవని, అయితే పూర్తిగా పరీక్షలు జరిపిన, లైసెన్స్ కలిగిన వ్యాక్సీన్ అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలే పట్టవచ్చని డబ్ల్యుహెచ్‌ఓ అంచనా వేస్తోంది.