జాతీయ వార్తలు

రెండు నెలల్లోనే తేల్చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అరవై రోజులో వ్యవధిలోనే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు అన్నింటినీ పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను నెలరోజుల్లోనే చేపట్టాలని అలా చేసినప్పుడే రెండు నెలల్లో ఈ సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలకు సంబంధించి సమస్యలు సకాలంలో పరిష్కరించడమే ప్రజాస్వామ్యం ప్రధాన లక్ష్యమన్నారు.
అలాగే సాధ్యమైనంత త్వరగా భూమి రికార్డులను ఆధార్‌తో సంధానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు సక్రమ అమలు, పాలనాపరమైన లోపాలను సవరించడానికి ఉద్దేశించిన ప్రగతి కార్యక్రమం ద్వారా ఆయన అధికారులతో అనుసంధానమయ్యారు. అదే సమయంలో ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి ఏ రకమైన పరిష్కారాలు జరుగుతున్నాయన్న విషయంపై కూడా సమీక్షించారు. ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో అధికారులు మరింత చురుగ్గా, క్రీయాశీలంగా వ్యవహరించాలని నిర్ణీత కాలవ్యవధిలోనే లక్ష్యాలను సాధించాలని మోదీ ఆదేశించారని పిఎంవో తెలిపింది. రహదారులు, రైల్వేలు, విద్యుత్, చమురు రంగం సహా అనేక రాష్ట్రాల్లో చేపడుతున్న కార్యక్రమాల అమలును వౌలిక ప్రాజెక్టుల తీరుతెన్నులను మోదీ పరిశీలించారు.
భారతదేశంలో చాలా తేలిగ్గా వ్యాపారం చేయడానికి వీలైన పరిస్థితులను అన్ని రాష్ట్రాలూ కల్పిస్తున్నాయని పేర్కొన్న ఆయన ఈ సానుకూల అవకాశాలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన విజయవంతంగా అమలుకావాలంటే భూమి రికార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడం అత్యవసరమన్నారు. అలాగే పౌరుల కోసం ఉద్దేశించిన అనేక ఎలక్ట్రానిక్ సేవల లభ్యతను కూడా పరిశీలించారు. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు ఏ విధంగా విస్తరించాయన్న విషయాన్ని జిల్లా సమీక్షల ద్వారా నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు.