జాతీయ వార్తలు

పిడబ్ల్యుఎఫ్‌తో జట్టుకట్టిన డిఎండికె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో బుధవారం రెండు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె నాలుగు పార్టీల కొత్త కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పిడబ్ల్యుఎఫ్)తో జట్టు కట్టడం ఒకటి. మరో సినీ నటుడు ఆర్.శరత్ కుమార్‌కు చెందిన ఎఐఎస్‌ఎంకె తిరిగి ఎఐఎడిఎంకె కూటమిలో చేరడం రెండోది. ఈ రెండు పరిణామాలు ఇటు ప్రధాన ప్రతిపక్షం డిఎంకెకు, అటు వివిధ రకాల చిన్న పార్టీలను కలుపుకొని రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బిజెపికి ఎదురుదెబ్బలే. అధికార ఎఐఎడిఎంకె, ప్రతిపక్ష డిఎంకెల తరువాత రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెనే. ఈ పార్టీకి రాష్ట్రంలో గణనీయ స్థాయిలో ఓటుబ్యాంకు ఉంది. అందుకే డిఎండికెతో జట్టు కట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని డిఎంకె శతవిధాలా ప్రయత్నించింది. డిఎండికెతో చర్చలు జరుగుతున్నాయని, పొత్తు కుదురుతుందని డిఎంకె అధినేత ఎం.కరుణానిధి ఇటీవల ప్రకటించారు కూడా. మరోవైపు డిఎండికెతో పాటు ఇతర చిన్న పార్టీలతో కలిసి రాష్ట్రంలో బలపడాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది. పొత్తు విషయమై విజయకాంత్‌తో చర్చలు జరపడానికి బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఫిబ్రవరి చివరి వారంలో ప్రత్యేకంగా తమిళనాడుకు వచ్చారు. అయితే అనూహ్యంగా బుధవారం విజయకాంత్ పిడబ్ల్యుఎఫ్‌తో చేతులు కలిపారు. కేవలం చర్చలు జరపడం మాత్రమే కాదు పొత్తు ఖరారు చేసుకొని, అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ ఒప్పందం ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికె 124 నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. మిగతా 110 నియోజకవర్గాలలో పిడబ్ల్యుఎఫ్‌లోని నాలుగు పార్టీలు ఎండిఎంకె, సిపిఎం, సిపిఐ, విసికె పోటీ చేస్తాయి. విజయకాంతే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ఈ పొత్తులో భాగంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో డిఎండికె ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల విజయకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఎండిఎంకె అధినేత వైకో నేతృత్వంలోని పిడబ్ల్యుఎఫ్ నేతలతో విజయకాంత్ చర్చలు జరపడంతో అది ఫలించి పొత్తు ఖరారయింది. సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందంపై విజయకాంత్, వైకో, జి.రామకృష్ణ (సిపిఎం), ఆర్.ముత్తరసన్ (సిపిఐ), తోల్ తిరుమవలవన్ (విసికె) సంతకాలు చేసి, మీడియాకు విడుదల చేశారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి.. డిఎండికె, పిఎంకె, ఎండిఎంకె, మరో నాలుగు చిన్న పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నది. ఫలితంగా ఎన్‌డిఎ రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో గెలుపొందింది.
మరోవైపు, ఎఐఎడిఎంకె కూటమితో ఇటీవల తెగదెంపులు చేసుకొని ఎన్‌డిఎ కూటమితో కలవడానికి అడుగులు వేసిన ఎఐఎస్‌ఎంకె తిరిగి మనసు మార్చుకుంది. శరత్ కుమార్ బుధవారం ముఖ్యమంత్రి జయలలితతో ఆమె పోయెస్ గార్డెన్ నివాసంలో భేటీ అయి తన మద్దతు ప్రకటించారు. శరత్‌కుమార్ నిర్ణయానికి అమ్మ (జయలలిత) కృతజ్ఞతలు తెలిపారని ఎఐఎడిఎంకె ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌డిఎలో చేరడానికి శరత్ కుమార్ ఫిబ్రవరి 28న చెన్నై వచ్చిన ప్రకాశ్ జావడేకర్‌తో చర్చలు కూడా జరిపారు. జావడేకర్ అందుకు స్వాగతించారు. అయితే శరత్ కుమార్ ఇంతలోనే మనసు మార్చుకొని తిరిగి ఎఐఎడిఎంకె కూటమిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో బహుముఖ పోటీకి రంగం సిద్ధం అయింది. ఎఐఎడిఎంకె, డిఎంకె, డిఎండికె-పిడబ్ల్యుఎఫ్, బిజెపి, పిఎంకె కూటములు పోటీ చేయనున్నాయి.