జాతీయ వార్తలు

జావడేకర్ సమక్షంలోనే.. మోదీపై హురియత్ విసుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ సమక్షంలోనే కాశ్మీర్ అతివాద, మితవాద హురియత్ నేతలు భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి జవడేకర్ హాజరయ్యారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రాజకీయ మార్గంలోనే ముందుకు వెళ్లాలని కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా కఠిన వైఖరినే ప్రదర్శిస్తోందని హురియత్ నేతలు విమర్శలు గుప్పించారు.కేవలం 20నిముషాలు మాత్రమే ఉన్న జవడేకర్ పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హురియత్ మితవాద నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ 3 బిజెపి సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో వాజపేయి విధానాన్ని అనుసరిస్తుందని భావించాం. కానీ మోదీ ప్రభుత్వం తన కఠిన వైఖరినే ప్రదర్శించింది2అని అన్నారు. హురియత్, కాశ్మీరీలు, పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఎలాంటి చర్చలు సఫలం కావన్నారు. కానీ వాజపేయి విధానాన్ని మోదీ సర్కార్ అమలు చేస్తుందని భావించడానికి ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు లేవన్నారు. కాశ్మీర్ విషయంలో యూపీఏ అనుసరించిన విధానానికి ఎన్‌డిఏ ప్రదర్శిస్తున్న వైఖరికీ ఎలాంటి తేడా లేదని అతివాద వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ అన్నారు.