జాతీయ వార్తలు

పర్యాటకానికి పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, పౌర విమానయాన రంగాల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రతి మూడు నెలలకూ అమరావతి లేదా ఢిల్లీలో ఈ టాస్క్ఫోర్స్ సమావేశమై ఆయా రంగాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేష్ వర్మ చెప్పారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒకరోజు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సిఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో సమావేశమై రాష్ట్రంలోని పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 900 కిలోమీటర్లమేర సముద్ర తీరం ఉందని, దీనివెంబడి సముద్రయానం అభివృద్ధి చేయవచ్చన్నారు. రాష్ట్రంలో నదీయానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పర్యాటక రంగంలో బాగా వెనుకబడి ఉన్నామంటూనే, పర్యాటకులను ఆకర్షించేందుకు పథకాలు అమలు చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీప ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయటానికి తొలివిడతగా వంద కోట్లు లభించాయన్నారు. రెండోవిడత నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సౌండ్ అండ్ లైట్ పథకాన్ని చేపట్టేందుకు కేంద్రం అంగీకరిందన్నారు. రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను అనసంధానిస్తూ రిలీజియస్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లు కూచిపూడిలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆడిటోరియం నిర్మించి, నృత్యాభివృద్ధికి 150 కోట్లతో పథకం అమలు చేస్తామన్నారు. అమరావతి నుంచి లండన్‌కు తరలిపోయి అత్యంత విలువైన కళాఖండాలను వీలైనపక్షంలో బ్రిటీష్ ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి తెచ్చేందుకు ప్రయత్నించాలని కేంద్రానికి ప్రతిపాదించామన్నారు. తిరుపతి, శ్రీశైలం ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయటం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

చిత్రం... ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు