జాతీయ వార్తలు

కాశ్మీర్ సిఎంగా నేడు మెహబూబా ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము/ శ్రీనగర్, ఏప్రిల్ 3: జమ్మూకాశ్మీర్ తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనాభా పరంగా ముస్లింల ఆధిక్యం గల ఈ రాష్ట్రంలో పిడిపి-బిజెపి కూటమి ప్రభుత్వానికి ఆమె నేతృత్వం వహించనున్నారు. పిడిపి వ్యవస్థాపకుడు, దివంగత సిఎం ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ కుమార్తె అయిన 56 ఏళ్ల మెహబూబా జమ్ములోని రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. భారత్‌లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరిస్తున్న రెండో ముస్లిం మహిళగా కూడ మెహబూబా చరిత్ర సృష్టించనున్నారు. 1980లో సరుూదా అన్వారా అస్సాం ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణం తరువాత మూడు నెలల ప్రతిష్టంభన అనంతరం జమ్మూకాశ్మీర్‌లో తిరిగి పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరుతోంది.
మెహబూబాతో పాటు 16మంది కేబినెట్ మంత్రులుగా, ఎనిమిది మంది సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో బిజెపికి చెందిన ఇద్దరికి స్వతంత్ర హోదాను కల్పిస్తారు. గత సంవత్సరం మార్చి ఒకటిన ముఫ్తీ మొహమ్మద్ సరుూద్‌తో కలిసి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన పిడిపి ఎమ్మెల్యేలు తిరిగి ఇప్పుడు మెహబూబాతో కలిసి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బిజెపి మాత్రం తమ పార్టీకి చెందిన వారినుంచి ఒకరిని ఈసారి తప్పించి, కొత్త వ్యక్తికి చోటు కల్పించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
మెహబూబా ముఫ్తీ ఆదివారం సాయంత్రమే జమ్ముకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జితేంద్ర సింగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మెహబూబా ఆదివారం ఉదయం స్వయంగా ఫరూక్, ఒమర్‌లకు ఫోన్ చేసి, తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.
‘్భరత్ మాతా కీ జై’ అని నినదిస్తారా?
సోమవారంనాడు అధికార పగ్గాలు చేపట్టనున్న పిడిపి-బిజెపి కూటమి సభ్యులు తమ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ‘్భరత్ మాతా కీ జై’ అంటూ నినదిస్తారా? అని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా యద్దేవా చేశారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అలాగే ‘్భరత్ మాతా కీ జై’ అననివారు భారత్‌లో ఉండాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘్భరత్ మాతా కీ జై’ అనడం ఇస్లాంకు వ్యతిరేకమని సన్నీ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇటీవల ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఫడ్నవిస్ పైవిధంగా స్పందించారు.