జాతీయ వార్తలు

కింది కోర్టుల సిబ్బంది విభజనకు క్లియరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య దిగువ స్థాయి కోర్టులలో క్యాడర్ విభజనకు మార్గం సుగమమైంది. హైకోర్టు విభజన జరిగేంత వరకూ న్యాయాధికారులను విభజించరాదని కోరుతూ అదనపు మేజిస్ట్రేట్ దుంపల ధర్మారావు ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గత జూలై 7న యథాతథ స్థితిని కొనసాగించవలసిందిగా తీర్పునిచ్చింది. క్యాడర్‌ను విభజించరాదన్న తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించి యథాతథ స్థితి కొనసాగించాలని గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇవ్వటంతో విభజనకు మార్గం సుగమమైంది.