జాతీయ వార్తలు

గృహ, వాహన రుణాలు చౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రిజర్వు బ్యాంకు తన వడ్డీ రేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు మాసాలకు సంబంధించి ద్రవ్య పరపతి విధానంపై రిజర్వు బ్యాంకు మంగళవారం సమీక్ష జరిపి వడ్డీ రేటను 0.25 శాతం కుదించింది. దీంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గేందుకు మార్గం సుగమమైంది. 2013 సెప్టెంబర్‌లో రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై దృష్టి సారించిన రఘురామ్ రాజన్ బెంచ్‌మార్కు రెపో రేటును 6.50 శాతానికి తగ్గించారు. 2011 జనవరి తర్వాత అత్యంత తక్కువ రెపోరేటు ఇదే. అంతేకాకుండా రెపోరేటుతో ప్రాధాన్యతా సగటు కాల్ రేటు (డబ్ల్యుఎసిఆర్) మరింత చక్కగా సంధానమయ్యేలా వీలు కల్పించాలన్న దృష్టితో ఎంఎస్‌ఎఫ్ రేటును 75 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించడం, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు పెంచడం ద్వారా పాలసీ రేటు కారిడార్‌ను +/-100 బేసిస్ పాయింట్ల నుంచి +/-50 బేసిస్ పాయింట్లకు కుదించనున్నట్లు కూడా ఆర్‌బిఐ ప్రకటించింది. తదనుగుణంగా ఎల్‌ఎస్‌ఎఫ్ కింద రివర్స్ రెపో రేటును 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటను 7 శాతానికి సర్దుబాటు చేసింది. అలాగే ఎంఎస్‌ఎఫ్ రేటుతో సంధానమైన బ్యాంకు రేటును కూడా 7 శాతానికి సర్దుబాటు చేసింది. అయితే నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని మాత్రం యథాతథంగా 4 శాతం వద్దే ఉంచాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది.