జాతీయ వార్తలు

రాష్ట్రాల్లో ఎన్నికలతో.. రూ.60 వేల కోట్లకు పైగా పెరిగిన నగదు చెలామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 5: ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నగదు చెలామణి భారీగా పెరగడంపై రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం కనె్నర్ర చేశారు. ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉన్న నగదు 60 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని, ఇది సాధారణ విషయం కాదని ఆయన పేర్కొంటూ, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ‘ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ధనం ఏరులై పారుతోంది. ప్రజల చేతుల్లోకి నగదు విపరీతంగా వెళ్తోంది. అందుకు కారణాలేమిటో నాతో పాటు మీకూ తెలుసు’ అని రఘురామ్ రాజన్ మంగళవారం ముంబయిలో విలేఖర్లతో అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వు బ్యాంకు తొలి ద్వైమాసిక సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను విలేఖర్లకు వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉన్న నగదు 60 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని, కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే కాకుండా వాటి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇదేమీ సాధారణ విషయం కాదని, దీనిపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
ఓబీసీలకు ఊరట!
నాన్ క్రీమీలేయర్ ధ్రువీకరణ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కేంద్ర ప్రభుత్వోద్యోగాలను ఆశించే ఇతర వెనుకబడిన వర్గాల( ఓబీసీ) అభ్యర్థులకు కేంద్రం ఊరట కల్పించనుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న సందర్భంలో తాము క్రీమీలేయర్ పరిధిలోకి రామంటూ ధ్రువీకరణ పత్రం సమర్పించనవసరం లేకుండా స్వయం ధ్రువీకరణ పత్రం(సెల్ఫ్ అటెస్ట్) మాత్రం సమర్పిస్తే చాలని కేంద సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఉద్యోగాల నియామక అధికారి అభ్యర్థి స్వయంగా ధ్రువీకరించిన పత్రాల ఫోటో కాపీని అనుమతించవచ్చని.. ఆ తరువాత నిజమైన నాన్ క్రీమీలేయర్ పత్రంతో పరిశీలన జరపవచ్చని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు పంపించాల్సిందిగా సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖ, యూపీ ఎస్సీ, స్ట్ఫా సెలక్షన్ కమిటీలను కోరింది. ఏదైనా ఉద్యోగానికైనా నిర్దేశిత ఆదాయపు పరిధిలోకి వచ్చిన ఓబీసీలు రిజర్వేషన్లకు అర్హులు కారన్న విషయం తెలిసిందే.